- Telugu News Photo Gallery Political photos Janasena party chief pawan kalyan inspected the special bus being prepared for his bus yatra photos
Pawan Kalyan bus yatra: సేనాని బస్సుకు ఫైనల్ టచ్.. ఇకపై రయ్యి రయ్యిమంటూ ప్రజల్లోకి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే యాత్ర చేపట్టబోతున్నారు.. పవన్ బస్సు యాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పవన్ కోసం ప్రత్యేకంగా బస్సు తయారైంది.. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు..
Phani CH |
Updated on: Oct 13, 2022 | 1:05 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే యాత్ర చేపట్టబోతున్నారు.. పవన్ బస్సు యాత్రకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

పవన్ కోసం ప్రత్యేకంగా బస్సు తయారైంది.. దీనికి తుది మెరుగులు దిద్దుతున్నారు..

హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ బస్సు.. ఎన్టీఆర్ చైతన్య రధాన్ని పోలి ఉంది.

ఇప్పటి వరకూ బస్సు యాత్ర చేసిన వివిధ పార్టీలు నేతలు వాడిన బస్సులకు భిన్నంగా ఈ బస్సును డిజైన్ చేశారు.

రెగ్యులర్ బస్సులు, లారీలకు వాడే పెద్ద టైర్లు దీనికి వాడారు. వర్క్ షాపులో తయారు అవుతున్న ఈ బస్సుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చి.. సోషల్ మీడియాలో రచ్చ చేశాయి..

ఈ నేపథ్యంలో ఇవాళ ఆ ప్రత్యేక వాహనాన్ని పరిశీలించారు జనసేనాని.. బస్సును పరిశీలించి.. కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది.

ఈ బస్సుకు ప్రత్యేకంగా సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు.. అంతేకాదు.. ఎంత దూరంలో ఉన్న.. వారికి పవన్ కల్యాణ్ కనిపించేలా బస్ టాప్ ఏర్పాటు చేస్తున్నారు

ఆ యాత్ర జరిగినన్ని రోజులు పవన్ కల్యాణ్ అందులోనే ఉండనున్న నేపథ్యంలో.. ఆయన అలవాట్లు, అవసరాలకు తగ్గట్టుగా అందులో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు..





























