Ganesh Chavithi: పర్యావరణ హితం ఈ వెరైటీ గణనాథులు.. దేనితో తయారు చేశారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పూజల కోసం భారీ మండపాల్లో కొలువుదీరారు. గణనాధులు. వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గణేష్ మండపాలలో వెరైటీ గణనాథుల విగ్రహాలు దర్శనమిస్తాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పూజల కోసం భారీ మండపాల్లో కొలువుదీరారు. గణనాధులు. వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గణేష్ మండపాలలో వెరైటీ గణనాథుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా పామిడిలో కూడా వెరైటీ గణనాథుడు కొలువు దీరి ఉన్నాడు. చెరకు, అరటి పండ్లు, మొక్కజొన్న కంకులతో గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
పామిడి పట్టణానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగ తేజ ప్రతి సంవత్సరం పర్యావరణానికి ఎలాంటి హానికరం కానీ విధంగా వెరైటీ వినాయకులను తయారు చేస్తుంటాడు. గత సంవత్సరం చాక్లెట్లతో వినాయకుడిని తయారు చేస్తే, ఏడాది వెరైటీగా చెరుకు, అరటికాయలు, మొక్కజొన్న కంకులతో వినాయకుడిని తయారు చేసి మరోసారి తన భక్తిని చాటుకున్నాడు. చెరకు, అరటికాయలు, మొక్కజొన్న కంకులతో తయారుచేసిన వినాయకుడి విగ్రహానికి నవరాత్రులు పూజలు చేసిన అనంతరం.. నిమజ్జనానికి బదులు, ఆవులకు ప్రసాదంగా పంచుతామంటున్నారు నాగ తేజ. అ
అటు గుంతకల్లులో కూడా ప్రత్యేకంగా ఆవు పేడతో తయారు చేసిన వినాయకుడి విగ్రహాల స్టాల్ కూడా అందరిని ఎంతగానో ఆకర్షిస్తుంది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే పవిత్రమైన ఆవు పేడతో వినాయకుల విగ్రహాలను తయారుచేసి గుంతకల్లు స్టాల్ ఏర్పాటు చేశారు. ఎకో గణనాథులను ప్రోత్సహించేందుకు కొంతమంది పర్యావరణవేత్తలు ఆవుపేడతో తయారుచేసిన వినాయకుడి విగ్రహాలను తీసుకువచ్చి ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. హిందూ సంప్రదాయంలో భాగంగా గోమాతను పూజిస్తాం. అంత పవిత్రంగా భావించే గోమాత పేడను వినాయక విగ్రహాలుగా తయారు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ఆవు పేడతో తయారు చేసిన గణనాధులను ఇంట్లోనే నిమజ్జనం చేయడం వల్ల.. నిమజ్జనం చేసిన నీరు చెట్లకు ఎరువుగా కూడా ఉపయోగపడుతుందంటున్నారు పర్యావరణవేత్తలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..