AP Rains: ఉరుములు, పిడుగులతో ఏపీలో వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలులు కోత ఇప్పుడు జార్ఖండ్ నుంచి దక్షిణ అంతర్గత తమిళనాడు..

AP Rains: ఉరుములు, పిడుగులతో ఏపీలో వర్షాలు.. ఈ ప్రాంతాలకు అలెర్ట్.. వెదర్ రిపోర్ట్ ఇదిగో.!
Ap Rains
Follow us

|

Updated on: Apr 04, 2023 | 4:07 PM

విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలులు కోత ఇప్పుడు జార్ఖండ్ నుంచి దక్షిణ అంతర్గత తమిళనాడు వరకు అంతర్గత ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువద్ద కొనసాగుతున్నది. ఈ కారణంగా రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. ఒకట్రెండు చోట్ల మెరుపులు సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- —————————–

  • ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు(గంటకు 30-40 కి.మీ వేగంతో)ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.

  • ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ———————–

  • ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

  • ఎల్లుండి:-

పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

రాయలసీమ:- —————-

  • ఈరోజు, రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

మరోవైపు తెలంగాణపై అధిక పీడన కొనసాగుతుండటంతో మంగళవారం(ఏప్రిల్ 4)న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధానంగా ఉభయగోదావరి, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కోనసీమ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.