Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తీరం వెంబడి ఈదురు గాలులు.. మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం..
ఈనెల 17వరకు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు వెల్లడించింది. ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏపీలోని కోస్తా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
దాంతోపాటు.. ఈనెల 17వరకు రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇక.. తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు వరసగా కురుస్తున్న భారీ వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు వంటి అనేక రకాల వ్యాధులతో ఆస్పత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు.
మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..