- Telugu News Andhra Pradesh News Guntur vinukonda mla bolla brahmanaidu warning to reporter photo story
MLA Brahmanaidu : ‘ఎంతవరకూ ఉండాలో అంతవరకూ ఉండు, తమాషాలాడుతున్నావ్’ : విలేకరికి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు వార్నింగ్
MLA Brahmanaidu : విలేకరికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వార్నింగ్, జైలుకు పంపుతానంటూ వేలు చూపిస్తూ హెచ్చరిక ..
Updated on: Mar 21, 2021 | 10:00 PM

గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నట్టుండి మీడియా ప్రతినిధిపై ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే ఊరుకోను.. జైలుకు పంపుతానంటూ వేలు చూపిస్తూ వార్నింగ్

ఏం తప్పుడు వార్తలు రాశామో చెప్పమని జర్నలిస్ట్ అడగడంతో మరింత స్వరం పెంచారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే, మీడియా ప్రతినిధికి మధ్య స్వల్ప వాగ్వాదం

ఇక్కడ ఎవడూ ఎవడిసొమ్మూ తినట్లా.. నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తున్నాం.. ఏదిబడితే అది మాట్లాడితే మామూలుగా ఉండదంటూ ఫైర్

ఎమ్మెల్యే ప్రవర్తనతో అసహనానికి గురైన జర్నలిస్ట్ అక్కడి నుంచి నిష్క్రమణ

వినుకొండలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని... వాటికి తప్పుడు పత్రాలు సృష్టించి కొందరు వెంచర్లు వేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు.

అలాంటి వాళ్ల దగ్గర ప్లాట్లు కొని ప్రజలు మోసపోవద్దని బ్రహ్మనాయుడు సూచించారు.