Somireddy Chandramohan Reddy : ‘వాలంటరీ వ్యవస్థకు భయపడాల్సిన అవసరం లేదు…తిరుపతి ఉప ఎన్నికలో వారి ఆటలు సాగబోవు’

Somireddy chandramohan reddy : ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు..

Somireddy Chandramohan Reddy : 'వాలంటరీ వ్యవస్థకు భయపడాల్సిన అవసరం లేదు...తిరుపతి ఉప ఎన్నికలో వారి ఆటలు సాగబోవు'
Somireddy
Follow us
Venkata Narayana

|

Updated on: Mar 21, 2021 | 10:04 PM

Somireddy chandramohan reddy : ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ జీఓలు ఏపీలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులు, కార్యకర్తలను జైలుకు పంపడంపై ఉన్న శ్రద్ధ, రాష్ట్ర ప్రగతిపై లేకుండాపోయిందని ఆయన వాపోయారు.”అందరూ కాదు.. కొందరు పోలీసులు, రెవెన్యూ అధికారులు మాత్రం పరిధి మీరి వ్యవహరిస్తున్నారు.. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకోం. వాలంటరీ వ్యవస్థకు భయపడాల్సిన అవసరం లేదు…తిరుపతి ఉప ఎన్నికలో వారి ఆటలు సాగబోవు…” అంటూ సోమిరెడ్డి తేల్చి చెప్పారు. గూడూరు, వెంకటగిరిల్లో జరిగిన కార్యకర్తల సమావేశాల్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..  ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, మాజీ మంత్రులు యనమల రామక్రిష్ణుడు తదితరులతో కలిసి పాల్గొన్నారు.

Somireddy 1

కనీసం సీఎంని కలిసే అవకాశమే లేని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు ఏం చేయగలరు..? అంటూ సోమిరెడ్డి ఈ సమావేశాలలో ప్రశ్నించారు. పనిచేసే లక్ష్మిగా గుర్తింపుపొందిన సౌమ్యురాలు, నిజాయతీపరురాలైన పనబాక లక్ష్మిని తిరుపతి ఎంపీగా గెలిపించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు ఎన్.అమర్నాథ్ రెడ్డి, సీనియర్ నాయకుడు పనబాక క్రిష్ణయ్య, మాజీ ఎమ్మెల్యేలు పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామక్రిష్ణ, పరసా రత్నం, తిరుపతి, నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్, అబ్దుల్ అజీజ్, పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, గంగోటి నాగేశ్వరరావు, జెన్ని రమణయ్య, బొమ్మి సురేంద్ర, చెంచలబాబు యాదవ్, కుంకాల దశరధ నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో