AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur Gandhi Park: గుంటూరు గాంధీ పార్క్‌ స్పెషల్ ఆఫర్‌.. కేజీ ప్లాస్టిక్‌ చెత్త తెస్తే ఎంట్రీ ఫ్రీ!

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు కార్పోరేషన్ నగర వాసులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఒకవైపు క్యారీ బ్యాగ్ లపై నిషేధం కొనసాగిస్తూనే మరొక వైపు గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని చేప్టటారు. క్లాత్ బ్యాగ్ లు వచ్చే వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరొక ఆఫర్ ను..

Guntur Gandhi Park: గుంటూరు గాంధీ పార్క్‌ స్పెషల్ ఆఫర్‌.. కేజీ ప్లాస్టిక్‌ చెత్త తెస్తే ఎంట్రీ ఫ్రీ!
Guntur Gandhi Park
T Nagaraju
| Edited By: Srilakshmi C|

Updated on: Jun 06, 2025 | 9:20 PM

Share

గుంటూరు, జూన్‌ 6: ప్లాస్టిక్ వినియోగంతో ప్రపంచ పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడింది. నగరాల్లో ప్లాస్టిక్ ఉపయోగించడంతో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య ఎక్కువైంది. ఈ క్రమంలోనే కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు అనేక చర్యలు చేపడుతున్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు కార్పోరేషన్ నగర వాసులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఒకవైపు క్యారీ బ్యాగ్ లపై నిషేధం కొనసాగిస్తూనే మరొక వైపు గుడ్డ సంచుల పంపిణీ కార్యక్రమాన్ని చేప్టటారు. క్లాత్ బ్యాగ్ లు వచ్చే వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరొక ఆఫర్ ను అనౌన్స్ చేశారు.

గుంటూరు నగరంలోనే అతి పెద్ద పార్క్ గాంధీ పార్క్… కార్పోరేషన్ ఆధ్వర్యంలో నగరం నడిబొడ్డున ఉన్న పార్క్ కు స్థానికుల తాడికి ఎక్కువగా ఉంటుంది. వారంతపు సెలవుల్లో అనేక మంది కుటుంబంతో కలిసి ఈ పార్క్ కు వస్తుంటారు. ఇందులోకి వెళ్లాలంటే పెద్దలు రూ.20, పిల్లలు రూ.10 టికెట్ కొనుగోలు చేయాలి. అయితే ఎవరైతే కేజీ నిషేధిత ప్లాస్టిక్ వ్యర్ధాన్ని తీసుకొస్తారో వారికి గాంధీ పార్క్ ఎంట్రీ టికెట్ ఉచితంగా ఇవ్వనున్నారు. పార్క్ గేటు వద్ద వేయింగ్ మిషన్ పెట్టి ప్లాస్టిక్ ను కొలిచి వాటిని అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో వేసేలా చర్యలు చేపట్టారు. దీని వలన నగరంలోని ప్లాస్టిక్ తగ్గుతుందన్న భావనలో కార్పోరేషన్ ఉంది.

ఈ రోజు నుండే ఈ ఆఫర్ ను అమలు చేస్తున్నారు. ఒక వైపు క్లాత్ బ్యాగ్ వెండింగ్ మెషీన్ల ద్వారా అందించడం మరొకవైపు ప్లాస్టిక్ తీసుకొచ్చిన వారికి పార్క్ లోకి ఉచితంగా అనుమతించడం వంటి చర్యలతో ప్లాస్టిక్ వినియోగాన్ని చాలా వరకూ తగ్గిచవచ్చని అధికారులు అంటున్నారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమీషనర్ పులి శ్రీనివాసులు కలిసి వెండింగ్ మెషీన్లను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.