AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంత అమానుషమా.. పెద్దల మాట వినలేదని కుల బహిష్కరణ.. ఎక్కడో కాదు..

కుల కట్టుబాట్లు తెంచుకుని దేశం అభివృద్ది దిశగా దూసుకుపోతున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ కట్టుబాట్లకు కట్టుబడని వారిపై బహిష్కరణ వేటు వేస్తూనే ఉన్నారు. గుంటూరు సమీపంలో తాజాగా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. గుంటూరుకు కూత వేటు దూరంలో ఉన్న వెనిగండ్లలో కుల పెద్దలు ఆదెమ్మ కుటుంబాన్ని కులం నుండి వెలివేశారు. వెలివేయడమే కాకుండా లక్ష రూపాయల జరిమానా కూడా వేశారు. ఇంతకు వాళ్లను ఎందుకు వెలివేశారో తెలుసుకుందాం పదండి.

ఇంత అమానుషమా.. పెద్దల మాట వినలేదని కుల బహిష్కరణ.. ఎక్కడో కాదు..
Andhra News
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 15, 2025 | 10:59 PM

Share

ప్రస్తుత సాంకేతిక యుగంలోనూ కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల బానిస బతుకులు మారట్లేదు. కుల కట్టుబాట్లు తెంచుకుని దేశం అభివృద్ది దిశగా దూసుకుపోతున్నా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ కట్టుబాట్లకు కట్టుబడని వారిపై బహిష్కరణ వేటు వేస్తూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వెనిగండ్ల గ్రామానికి చెందిన ఆదెమ్మకు ఐదుగురు కొడుకులు.. అయితే కొన్నేళ్ల క్రితం ఆమె పెద్ద కొడుకుకు ఒ యువతితో వివాహం జరిగింది. అయితే అతడు మరొక బాలికతో సన్నిహితంగా ఉండటంతో గమనించి బాలిక తల్లిదండ్రులు కుల పెద్దల ఎదుట పంచాయితీ పెట్టారు. ఇది జరిగి నాలుగేళ్లు అవుతోంది. పంచాయితీలో మూడు లక్షల కట్టాలంటూ పెద్దలు తీర్పు ఇచ్చారు. అప్పటి నుండి కుల పెద్దలకు ఆదెమ్మ కుటుంబానికి మధ్య విబేధాలు వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఆదెమ్మ కొంతమందికి డబ్బులు చెల్లించాల్సి ఉంది. మరోసారి కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఈసారి అప్పు కట్టారు. లక్ష రూపాయలు డబ్బులు చెల్లించాలని తీర్పు చెప్పారు. కుల పెద్దల తీర్పుపై ఆదెమ్మ కొడుకులు నాగరాజు, రమేష్ ఎదురు తిరిగారు. దీంతో వివాదం పెద్దదైంది. ఆదెమ్మ కుటుంబాన్ని కులం నుండి వెలివేశారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయిస్తే ప్రాణహాని తప్పదన్న హెచ్చరికలతో ఆదెమ్మ కుటుంబం వారి కాలనీకి దూరంగా వెళ్లి జీవిస్తుంది. అయితే కుల పెద్దల పంచాయితీపై ఎలాగైనా పోలీసులను ఆశ్రయిచాలని ఆదెమ్మ కుటుంబం నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే స్తానిక పోలీస్ స్టేషన్ కు కాకుండా నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు బాధితులు. అధికారులకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు.

బాధితుల ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు వెంటనే కాలనీలో జరుగుతున్న పరిణామాలపై ద్రుష్టి పెట్టారు. కుల పంచాయితీలు పెట్టడం, కుల బహిష్కరణ చేయడం నేరమని కాలనీలో ప్రచారం చేశారు. ఆదెమ్మ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.