ITI Counselling dates: జూన్ 16, 17 తేదీల్లో ఐటీఐ ప్రవేశాలకు కౌన్సెలింగ్.. పూర్తి వివరాలివే
ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్, ప్రిన్సిపల్ ఎం కనకారావు..
NTR district ITI Admissions: ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్, ప్రిన్సిపల్ ఎం కనకారావు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్16వ తేదీన ఉదయం 8 గంటలకు మెరిట్ ఆర్డరు ఒకటో ర్యాంకు నుంచి 118 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 119 నుంచి 207 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. మరుసటి రోజు (జూన్17) ఉదయం 208 నుంచి 304 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 305 నుంచి 418 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు అప్లికేషన్‌తోపాటు పదో తరగతి మార్కుల జాబితా, బదిలీ సర్టిఫికేట్, కుల, ఆర్థిక పత్రాలు, ఆధార్, విద్యార్హత పత్రాల ఒరిజినల్స్‌తో రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రవేశాలు పొందిన ఓసీ/బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.60 కాషన్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ఎటువంటి ఫీజులు చెల్లించనవసరం లేదని ప్రిన్సిపల్ తెలిపారు. ఇతర సందేహాలకు ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ హెల్ప్ డెస్కు 0866-2475575, 94906-39639 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.