Andhra Pradesh: మంచి రోజులొచ్చాయ్.. మార్కెట్‌లో మిర్చికి పెరిగిన డిమాండ్.. ఎంత ధర పలుకుతుందంటే..
మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత కొంత కాలంగా క్వింటా రూ. 20 వేలకు పైగా ధరలు పలకటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి తగ్గినప్పటికీ ధరలు నిలకడగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత కొంత కాలంగా క్వింటా రూ. 20 వేలకు పైగా ధరలు పలకటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక దిగుబడి తగ్గినప్పటికీ ధరలు నిలకడగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
గుంటూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవటంతో దిగుబడులు తగ్గాయి. ఎకరానికి పదిహేను క్వింటాళ్ల వరకూ సగటు దిగుబడి వచ్చింది. క్వింటా మిర్చి ధర ఇరవై వేల రూపాయల పైగా పలుకుతుంది. బాడ్గి రకం ఈ రోజు క్వింటా ధర ఇరవై ఆరు వేల రూపాయలు ధర పలికింది. తేజ రకం క్వింటా ఇరవై నాలుగు వేల ధర పలికింది. సాధారణ వెరైటీ రకాలు కూడా క్వింటా రూ. 20 వేలు పలుకుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మిర్చి యార్డుకు 1,25, 000 టిక్కిల మిర్చి యార్డుకు వస్తున్నాయి. వచ్చిన మిర్చి టిక్కిలు వచ్చినట్లే అమ్ముడు పోతున్నాయి. ఇతర దేశాల నుండి ఆర్డర్స్ వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల కూడా మిర్చి దిగుబడులు తగ్గాయి. దీంతో ధరలు నిలకడగా ఉన్నాయి. చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలనుండి ఆర్డర్స్ వస్తున్నాయని ఎగుమతి వ్యాపారులు చెప్పారు. మరో రెండు వారాల పాటు ఇదే ధరలు కొనసాగే అవకాశం ఉంది. మేలో మిర్చి యార్డుకు సెలవులు ప్రకటించేంత వరకూ రోజు లక్ష టిక్కిల పైనే మిర్చి యార్డుకు వస్తాయని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..