అగ్రిగోల్డ్ బాధితుల‌కు గుడ్ న్యూస్‌.. రూ.20 వేల‌లోపు డిపాజిట్ చేసిన వారి జాబితాలు సిద్ధం చేస్తున్న సీఐడీ

అగ్నిగోల్డ్‌బాధితుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్ర‌భుత్వం. బాధితుల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చిన హామీ అమ‌లులో భాగంగా మ‌రో అడుగు ముందుకుప‌డింది. సీఎం ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి...

అగ్రిగోల్డ్ బాధితుల‌కు గుడ్ న్యూస్‌.. రూ.20 వేల‌లోపు డిపాజిట్ చేసిన వారి జాబితాలు సిద్ధం చేస్తున్న సీఐడీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 15, 2020 | 3:29 PM

అగ్నిగోల్డ్‌బాధితుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్ర‌భుత్వం. బాధితుల‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చిన హామీ అమ‌లులో భాగంగా మ‌రో అడుగు ముందుకుప‌డింది. సీఎం ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి ఇప్ప‌టికే రూ.10వేల లోపు న‌గ‌దు డిపాజిట్ చేసిన వారి‌కి ఆ మొత్తాల‌ను చెల్లించిన విష‌యం తెలిసిందే. అయితే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. మొద‌టి ద‌శ‌లో రూ. 263.99 కోట్లు విడుద‌ల చేసి గ‌త సంవత్స‌రం అక్టోబ‌ర్ నెల‌లో డిపాజిట‌ర్ల‌కు చెల్లింపులు జ‌రిపారు.

రూ.20 వేల‌లోపు డిపాజిట్ చేసిన వారికి సైతం న‌గ‌దు చెల్లించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని రాష్ట్ర స‌ర్కార్ కోర‌గా, తెలంగాణ హైకోర్టు న‌వంబ‌ర్ 9న ఇందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఏపీ సీఐడీ ఆధ్వ‌ర్యంలో వార్డు స‌చివాల‌యాల ద్వారా డిపాజిట్ దారుల వివ‌రాల‌ను సేక‌రించే చ‌ర్య‌లు చేప‌ట్టింది ప్ర‌భుత్వం. మార్చి నాటికి రూ.20వేల‌లోపు డిపాజిట్ చేసిన వారి వివ‌రాల‌ను సేక‌రించి ప్ర‌భుత్వానికి నివేదిస్తామ‌ని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తెలిపారు.