GATE 2022: 64 ఏళ్ల వయసులో గేట్‌లో 140వ ర్యాంకు.. చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించిన అనంతపురం వాసి
GATE 2022: సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ కూడా అసాధ్యం కాదు. అనంతపురం (Anantapur)కు చెందిన వి. సత్యనారాయణరెడ్డి (Satya Narayan Reddy) వయసు 64 ఏళ్లు...
GATE 2022: సాధించాలనే పట్టుదల ఉంటే ఏదీ కూడా అసాధ్యం కాదు. అనంతపురం (Anantapur)కు చెందిన వి. సత్యనారాయణరెడ్డి (Satya Narayan Reddy) వయసు 64 ఏళ్లు. గేట్ పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 140వ ర్యాంకు సాధించారు. ఈక్రమంలో ఆయన జియో గ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS), రిమోట్ సెన్సింగ్ కోర్సులో చేరేందుకు రెడీ అయ్యాడు. బాంబే ఐఐటీ (IIT)లో చేరాలా? లేదంటే రూర్కీ ఐఐటీలో చేరాలా? అనే విషయంలో కొంత సందిగ్ధంగా ఉన్నారు. కుటుంబ సభ్యులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు సత్య నారాయణరెడ్డి. జాయతీయ స్థాయిలో ర్యాంకు సాధించి ఔరా అనిపించుకున్నారు. సత్య నారాయణరెడ్డి పంచాయతీరాజ్ శాఖలో ఇంజనీరుగా 39 ఏళ్లు పని చేశారు. డీఈఈగా 2018లో ఉద్యోగ విరమణ పొందారు.2019లో జేఎన్‌టీయూ సివిల్ భాగంలో ఎంటెక్‌లో చేరి 2022లో పూర్తి చేశారు.
2022 గేట్ పరీక్షలోని జియోమోటిక్స్ ఇంజనీరింగ్ పేపర్‌లో 140 ర్యాంకు సాధించారు. 64 ఏళ్లు ఉన్న సత్య నారాయణరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అనడానికి చక్కటి నిర్వచనం చూపించారు సత్య నారాయణరెడ్డి. చదువుకోవాలనే శ్రద్ధ, పట్టుదల ఉంటే చదువుకు వయసు అడ్డు రాదు నిరూపించారు. ఏదైనా సాధించాలంటే పట్టుదల అవసరమని, అందుకు వయసు అడ్డు కాదని చెబుతున్నారు. కేవలం కృషి, పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని సత్య నారాయణరెడ్డి చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: