AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్‌ కొరత.. బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు.. జనం గగ్గోలు.. ఎక్కడంటే

Gas shortage News in telugu: ఒంగోలులో వంట గ్యాస్‌ కొరత తీవ్రంగా మారింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రభావం గ్యాస్‌ సరఫరాపై పడింది. ఎక్కడా వంట గ్యాస్‌కు కొరత లేదని ప్రభుత్వాలు ప్రకటిస్తుండగా, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్యాస్‌ కొరత.. బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు.. జనం గగ్గోలు.. ఎక్కడంటే
Gas
Fairoz Baig
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 3:47 PM

Share

ఒంగోలులోని పూర్ణిమా ఇండేన్‌ గ్యాస్‌ ఎజెన్సీ ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఒకవైపు ప్రభుత్వం గ్యాస్‌ కొరత లేదని చెబుతుంటే మరోవైపు గ్యాస్‌ ఏజెన్సీలు నో స్టాక్‌ బోర్డులు పెట్టి వినియోగదారులను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నారా, లేక బ్లాక్‌ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారా.. అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ బుక్‌ చేసి నెల రోజులవుతున్నా సరఫరా చేయడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఒంగోలులోని పూర్ణిమా ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ దగ్గర జనం సిలిండర్ల కోసం పడిగాపులు పడుతున్నారు. జనం వత్తిడి తట్టుకోలేక ఏజెన్సీ ప్రతినిధులు, డెలివరీ బాయ్‌లు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకుంటున్నారు. మిగిలిన గ్యాస్‌ ఎజెన్సీల దగ్గర పరిస్థితి సాధారణంగానే ఉంటే ఒక్క పూర్ణిమా ఇండేన్‌ గ్యాస్‌ దగ్గనే ఎందుకు స్టాక్‌ లేదని ప్రశ్నిస్తున్నారు.

ఓటిపి వచ్చినా డెలివరీ లేదు..

ఒంగోలులో వంట గ్యాస్‌ కొరత తీవ్రంగా మారింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధం ప్రభావం గ్యాస్‌ సరఫరాపై పడింది. ఎక్కడా వంట గ్యాస్‌కు కొరత లేదని ప్రభుత్వాలు ప్రకటిస్తుండగా, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకోవడానికి బుకింగ్‌కి బుకింగ్‌కి మధ్య గడువు 25 రోజులు పెంచడంతో వ్యాపారులతో పాటు వంట గ్యాస్‌ వినియోగించే గృహిణులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో గ్యాస్‌ బాయ్‌లు సిలిండర్లను అడిగిన వెంటనే ఇచ్చేవారు. ఇప్పుడు యుద్ధం ప్రభావం కారణం చూపుతూ సరఫరాలో కోత విధిస్తున్నారు. దీంతో గృహ వినియోగదారుల గ్యాస్‌ కష్టాలు ఎక్కువయ్యాయి. గ్యాస్‌ కొరత కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని, గ్యాస్‌ సరఫరాకు ఇబ్బంది లేదని కేంద్రం ప్రకటిస్తుంటే స్థానికంగా గ్యాస్‌ సరఫరా చేయకుండా బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

బ్లాక్‌లో అమ్ముకుంటున్నారా.. ?

వంట గ్యాస్‌ సరఫరా సరిపడినంత లేకపోవడంతోపాటు, వినియోగదారుల నుంచి బుకింగ్‌లు ఎక్కువయ్యాయి. ఏజెన్సీలు వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందించలేని పరిస్థితి ఉంది. దీంతో కొన్ని రోజులుగా తమ ఏజెన్సీలను మూసివేసి, ఏకంగా గోడౌన్‌ల వద్దకు మకాం మార్చేశారు. దీంతో విషయం తెలియని కొందరు షాపుల వద్ద గంటల తరబడి పడిగాపులు పడుతున్నారు. ఒంగోలులోని పూర్ణిమా ఇండేన్‌ గ్యాస్‌ ఎజెన్సీ దగ్గర జనం ఆందోళనకు దిగారు. తాము గ్యాస్‌ బుక్‌ చేయగా ఇన్‌వాయిస్‌ జనరేట్‌ అయి ఓటిపి కూడా వచ్చిందని, కానీ సిలిండర్లు డెలివరీ మాత్రం 30 రోజులైనా చేయడం లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్లను బ్లాక్‌ మార్కెట్లో అమ్ముకుంటున్నారని అనుమానంగా ఉందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు