Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Workers: మున్సిపల్ కార్మికుల సమ్మెతో అధికారుల ప్రత్యమ్నాయ ఏర్పాట్లు..

ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతం అవుతుంటే.. మరోవైపు పట్టణంలో చెత్త పేరుకుపోతోంది. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కుప్పలు కుప్పలుగా పడి ఉండడంతో దోమలు ఎక్కువవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తోందన్న వార్తలతో జనాలు భయపడిపోతున్నారు. తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయంగా నిన్న శనివారం రాత్రి నుంచి పట్టణంలోని సంత మార్కెట్లో చెత్త తీయడానికి ప్రవేటు వ్యక్తులను తీసుకొని వెళ్లారు

Municipal Workers: మున్సిపల్ కార్మికుల సమ్మెతో అధికారుల ప్రత్యమ్నాయ ఏర్పాట్లు..
Garbage In Nandyal
Follow us
J Y Nagi Reddy

| Edited By: Srikar T

Updated on: Dec 31, 2023 | 3:35 PM

ఆత్మకూరు పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతం అవుతుంటే.. మరోవైపు పట్టణంలో చెత్త పేరుకుపోతోంది. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి కుప్పలు కుప్పలుగా పడి ఉండడంతో దోమలు ఎక్కువవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. దేశంలో కరోనా విజృంభిస్తోందన్న వార్తలతో జనాలు భయపడిపోతున్నారు. తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని పట్టణ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయంగా నిన్న శనివారం రాత్రి నుంచి పట్టణంలోని సంత మార్కెట్లో చెత్త తీయడానికి ప్రవేటు వ్యక్తులను తీసుకొని వెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న మున్సిపల్ కార్మికులు అక్కడికి వెళ్లి మున్సిపల్ అధికారులను ప్రైవేటు వ్యక్తులను అడ్డుకొని వాగ్వాదానికి దిగారు.ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు చెత్త ఎత్తనివ్వమని భీష్మించుకున్నారు. దీంతో చేసేదేమీ లేక మున్సిపల్ అధికారులు వెనుతిరిగారు.

ఆదివారం సంత మార్కెట్ ఉన్నందున ప్రజలకు ఇబ్బంది అవుతుందని కేవలం మిషన్ ద్వారా చెత్తను ఒకవైపు ఉంచి.. మిగతా చోట్ల అలాగే ఉంచేస్తామని అధికారులు చెప్పడంతో మున్సిపల్ కార్మికులు రాత్రి శాంతించారు. అయితే రాత్రి తమకు తెలియకుండా చెత్త కుప్పలను ఎక్కడ తీసుకెళ్తారో నని రాత్రంతా చెత్తకు కాపలాకాస్తూ అక్కడే నిద్రించారు కార్మికులు. ఈరోజు ఉదయం చెత్త ఎత్తడానికి వచ్చిన వ్యక్తులను, అధికారులను మరోసారి గౌడ్ సెంటర్లో అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు చెత్త ఎత్తనివ్వమని పట్టుబట్టారు కార్మికులు. పట్టణంలో గౌడ్ సెంటర్ తో పాటు మిగిలిన ప్రాంతాల్లో చెత్త కుప్పలు తెప్పలుగా పడిఉండటంతో చుట్టు పక్కలి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితులపై మున్సిపల్ శాఖ అధికారులు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. చెత్త తెచ్చి రోడ్లపై వేయకండని సూచించారు. తమ ఇంటివద్దకే చెత్త సేకరించే వాళ్లు వస్తారని తెలిపారు. అట్టడబ్బాల్లో, సంచుల్లో ఉంచాలని రోడ్డపై, ప్రధాన కూడళ్లలో చెత్త తీసుకువచ్చి వేయకండి అని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా మైకుల్లో ప్రకటన చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..