ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. కొత్త ఏడాది నయా జోష్ వస్తుందట
ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. వై నాట్ ఏపీ అనే నినాదంతో ముందుకు సాగేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.
రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఒకప్పుడు ఏపీలో ఓ వెలుగువెలిగిన కాంగ్రెస్.. అక్కడ పాతాళానికి పడిపోయిన పరిస్థితి. ఏపీలో కాంగ్రెస్ మళ్లీ కోలుకుంటుందా ? అనే సందేహాల వ్యక్తమవుతున్న వేళ.. పరిస్థితి మారుతుందన్న ధీమా ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఏడాది ఏపీ రాజకీయాలు మారతాయని.. ఏపీలో తాము బలపడతామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం ఆ పార్టీ రోడ్ మ్యాప్ కూడా రెడీ చేసుకున్నట్టు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆమె చేరికతో రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని గట్టిగా నమ్ముతున్నారు. ఏపీలో అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాలపై సభలు ఏర్పాటు చేస్తామని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం తెలిపారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అభివృద్ధి అంటే చూపిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని తెలిపారు. మొత్తానికి ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్.. అందుకు తగ్గ ఫలితాలు అందుకుంటుందా ? అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..