Nellore: కంగారుగా పరిగెత్తుకుంటూ పెట్రోల్ బంక్‌లోకి వచ్చిన మూగ మహిళ.. పాపం…
Nellore District News in Telugu: రోడ్డుపై వెళ్తున్న ఆమెను వెంటాడారు. పట్టుకున్నారు. పాపం బాధితురాలికి మాటలు రావు. చాకచక్యంగా తప్పించుకోకపోయి ఉంటే ఎంతంటి ఘోరం జరిగేదో. ఉన్మాదుల్లా ప్రవర్తించిన ఆ ముగ్గురిని పట్టుకునేందుకు ప్రజంట్ వేట షురూ చేశారు పోలీసులు.
Andhra News: ఎక్కడో పల్లెల్లో కాదు.. పట్టాణాలు నగరాల్లో సైతం ఆడపిల్లలకు, మహిళలకు భద్రత కరువైంది. అడుగు తీసి అడుగు బయటపెట్టాలంటే భయం వేసే పరిస్థితులు వచ్చాయి. తాజాగా.. ఏపీలో అలాంటి దారుణ ఘటనే వెలుగుచూసింది. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని మాచవరం రోడ్డులో మూగ మహిళపై అత్యాచారయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళను ముగ్గురు వ్యక్తులు వెంటాడు. ఆపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. వారి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న మహిళ.. పరిగెత్తుకుంటూ దగ్గర్లోని పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లింది.
పెట్రోల్ బంక్ సిబ్బంది బాధిత మహిళను రక్షించి.. పోలీసులుకు సమాచారమిచ్చారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు నిందితులను గుర్తించారు. వారిలో ఒకరు ఆటో డ్రైవర్ కాగా.. మరో ఇద్దరు దుండగులు పట్టణంలో గుర్ఖాలుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక డీఎస్పీ సైతం స్పాట్‌కు వచ్చి.. స్థానికులును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కామాంధులపై రేప్ అంటెప్ట్‌తో పాటు అట్రాసిటీ కేసు నమోదు చేశామని.. త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేస్తామని డీఎస్పీ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం