AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో వైసీపీ మరో కొత్త కార్యక్రమం.. ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ పేరుతో..

ఆ తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమం కూడా నిర్వహించింది. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటిలో అవసరమైన సర్టిఫికెట్లను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా వారం రోజుల్లో అందించింది. ఇక ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న కోటీ 60 లక్షల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహణతో పాటు ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముందుకెళ్లింది ప్రభుత్వం. ఈ నెల పదో తేదీతో...

Andhra Pradesh: ఏపీలో వైసీపీ మరో కొత్త కార్యక్రమం.. 'వై ఏపీ నీడ్స్‌ జగన్‌' పేరుతో..
Why Ap Needs Jagan
S Haseena
| Edited By: |

Updated on: Nov 06, 2023 | 4:24 PM

Share

వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దీనికోసం ప్రత్యేక కార్యాచరణ కూడా సిద్ధం చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. రకరకాల కార్యక్రమాల ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోనే ఉండేలా చూస్తున్నారు. నెల రోజుల క్రితం వరకూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం.

ఆ తర్వాత జగనన్న సురక్ష కార్యక్రమం కూడా నిర్వహించింది. జగనన్న సురక్ష ద్వారా ప్రతి ఇంటిలో అవసరమైన సర్టిఫికెట్లను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా వారం రోజుల్లో అందించింది. ఇక ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఉన్న కోటీ 60 లక్షల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహణతో పాటు ఉచితంగా వైద్య సేవలు అందించేలా ముందుకెళ్లింది ప్రభుత్వం. ఈ నెల పదో తేదీతో ఈ కార్యక్రమం ముగియనుంది.

మరోవైపు సామాజిక సాధికార యాత్రల పేరిట బస్సు యాత్రలు కూడా కొనసాగుతున్నాయి. గత నెల 26న ప్రారంభమైన బస్సు యాత్రలు డిసెంబర్ నెలాఖరు వరకూ కొనసాగనున్నాయి. బస్సు యాత్రల ద్వారా ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభల ద్వారా ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఇక వీటితో పాటు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది ప్రభుత్వం. వై ఏపీ నీడ్స్ జగన్ పేరిట కార్యక్రమం నిర్వహించనుంది

ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటే..

నవంబర్ తొమ్మిదో తేదీ నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఎలా ఉండాలనే దానిపై గత నెలలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి మరోమారు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం-పార్టీ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లనున్నాయి. ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్న సీఎం… గ్రామాల వారీగా ఎంత నగదు బదిలీ ఇచ్చాం, ఎంతమందికి ఎలా లబ్ధి జరిగింది అన్నదానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలని సీఎం జగన్ సూచించారు. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలని, ఆ గ్రామంలో ఎంత మంచి జరిగిందో చెప్పాలన్నారు.

ఏ పథకం ఎలా పొందాలో వారికి తెలియాలని సీఎం తెలిపారు. కలెక్టర్లకు దీనికి సంబంధించి పలు ఆదేశాలిచ్చారు. ఒకవేళ ఎవరికైనా ఏమైనా సంక్షేమ పథకాలు అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో నాడు – నేడు ద్వారా వచ్చిన మార్పులు చెప్పాలన్నారు. రైతు భరోసా కేంద్రాలతో పాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు గురించి ప్రజలకు వివరించనున్నారు. పథకాల అమల్లో పారదర్శకతతో ముందుకెళ్తున్న అంశాన్ని ప్రజలకు వివరించాలని సీఎం జగన్‌ సూచించారు. సోషల్‌ ఆడిట్‌ ద్వారా నాణ్యంగా అందుతున్న సేవలు, దిశ యాప్‌ ద్వారా అందుతున్న సేవలను కూడా ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం వివరించనుంది.

ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి వారికిచెప్పాలని, ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉండేవాళ్లం? ఇప్పుడు ఎలా ఉన్నాం? అన్న అంశాలను వివరించాలని సీఎం ఆదేశించారు. డీబీటీ, నాన్‌డీబీటీ, గ్రామంలో లబ్ధిదారుల గురించి పూర్తి అవగాహన కల్పించాలన్నారు. డేటాతో పాటు జరిగిన మంచిపై ఆధారాలు చూపిస్తూ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..