వర్షాల కోసం వినూత్న పూజలు ప్రార్థనలు.. వాన కోసం కప్పకు తప్పని తిప్పలు

ఈ సందర్భగా ముందుగా గ్రామంలో రోకలి బండ కు వేపాకులతో కట్టిన జోలెలో రెండు కప్పలను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన విరాళం డబ్బులతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఋతుపవనాల కదలిక ప్రకారం ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం కావలసి ఉన్నా సరైన సమయానికి వర్షాలు కురవక , కనీసం విత్తనం కూడా పడలేదని , ఇప్పటికైనా త్వరగా వర్షాలు కురవాలని వరుణ దేవుని ప్రార్థిస్తూ, ఆచారం ప్రకారం గ్రామస్తులు కప్పలకు పెళ్లి చేశారు.

వర్షాల కోసం వినూత్న పూజలు ప్రార్థనలు.. వాన కోసం కప్పకు తప్పని తిప్పలు
Rains
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 07, 2024 | 10:11 PM

వ్యవసాయం కోసం సరైన సమయానికి వర్షాలు విస్తారంగా కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , ఆదోని మండల పరిధిలోని కొత్తూరు గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం రైతుల పిల్లలు ఆదివారం కప్పలకు పెళ్లి చేశారు. ఈ సందర్భగా ముందుగా గ్రామంలో రోకలి బండ కు వేపాకులతో కట్టిన జోలెలో రెండు కప్పలను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన విరాళం డబ్బులతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఋతుపవనాల కదలిక ప్రకారం ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం కావలసి ఉన్నా సరైన సమయానికి వర్షాలు కురవక , కనీసం విత్తనం కూడా పడలేదని , ఇప్పటికైనా త్వరగా వర్షాలు కురవాలని వరుణ దేవుని ప్రార్థిస్తూ, ఆచారం ప్రకారం గ్రామస్తులు కప్పలకు పెళ్లి చేశారు.