AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం జగన్‌తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ.. తిరుమల దేవస్థానంపై కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని....

సీఎం జగన్‌తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ.. తిరుమల దేవస్థానంపై కీలక వ్యాఖ్యలు
Ram Naramaneni
|

Updated on: Mar 10, 2021 | 10:18 PM

Share

Bjp mp subramanian swamy meets jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి‌ ఆయనను సాదరంగా ఆహ్వానించి, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఇరువురి మధ్య కీలక అంశాలపై చర్చ జరిగింది. భేటీ అనంతరం ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మీడియాతో మాట్లాడుతూ… విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తానని సుబ్రహ్మణ్యస్వామి వెల్లడించారు. ప్రతిదాన్ని ప్రైవేటీకరించడం మంచిదికాదని చెప్పారు. గతంలో కూడా ఎయిరిండియా ప్రైవేటీకరణనూ వ్యతిరేకించానని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు.  సర్కారు వ్యాపారం చేయవచ్చా లేదా అనేదాన్ని కేస్ బై కేస్ చూడాలని ఆయన పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా మార్చాలన్న సుబ్రహ్మణ్యస్వామి.. టీటీడీ ఖాతాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం బాగుందని ప్రశంసించారు. టీటీడీని భక్తులే నడిపించేలా తీర్చిదిద్దాలని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్‌తో మంచి సంబంధాలు ఉండేవని గుర్తు చేశారు.

కాగా బుధవారం ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్న సుబ్రహ్మణ్య స్వామి.. తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం యథేచ్ఛగా సాగుతోందని, ఏడుకొండలపై చర్చి, శిలువ నిర్మాణం సాగుతోందంటూ పలు మీడియాల్లో ప్రసారమైన వార్తలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య వార్తలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా హౌస్‌పై ఏకంగా వందకోట్ల రూపాయలకు దావా వేసినట్లు వెల్లడించారు. కొందరు కావాలనే   శ్రీవారి ఆలయంపై కొంతమంది అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నారని చెప్పారు.

Also Read:

ఏపీ మున్సిపల్ ఎన్నికల వేళ సడెన్‌గా మెరిసిన లగడపాటి రాజగోపాల్.. ప్రజల నాడి ఎలా ఉందని అడిగితే..?

మరో ట్విస్ట్.. అసలు హారిక ఎవరని ప్రశ్నించిన తెలంగాణ టూరిజం మినిస్టర్