Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత.. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస..
వట్టి వసంత్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస..
మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వట్టి వసంత్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున వైజాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వట్టి వసంత్‌కుమార్ స్వస్థలం ప.గో.జిల్లా పూండ్ల. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు శాసనసభ సభ్యుడు వట్టి వసంతకుమార్ పని చేశారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. రోశయ్య కేబినెట్‌లోనూగ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు వసంత్‌కుమార్. వట్టి వసంత్‌కుమార్ భౌతికకాయాన్నిస్వగ్రామం పూండ్లకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం