Devineni Uma: ఎన్ని కేసులైతేంటీ.. తగ్గేదే లే.. నారాయణ అరెస్ట్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు

మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నారాయణ అరెస్టు వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు.

Devineni Uma: ఎన్ని కేసులైతేంటీ.. తగ్గేదే లే.. నారాయణ అరెస్ట్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు
Devineni Uma
Follow us
Balaraju Goud

|

Updated on: May 10, 2022 | 6:20 PM

Devineni Uma on YS Jagan: మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. నారాయణ అరెస్టు వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్ర ఉందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గంపలగూడెం మండలం గోసవీడు గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలను ఉద్దేశించి దేవినేని ఉమ మాట్లాడుతూ.. నారాయణ అరెస్టు చేయడం సిగ్గుమాలిన చర్య అని దేవినేని ఉమా అన్నారు. ఎన్ని కేసులు పెట్టిప తగ్గేదే లే.. భయపడేది లే.. వైసీపీకి భయపడే రోజులు పోయాయని ఆయన అన్నారు. టీడీపీ శ్రేణులు భయపడవద్దని.. తాడోపేడో తేల్చుకుందామని తెలిపారు. నారాయణ అక్రమ అరెస్ట్‌పై పెద్ద ఎత్తున పోరాటం చేద్దామని టీపీపీ శ్రేణులకు దేవినేని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి నారాయణ, అతని భార్యను చిత్తూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి ఏం చేస్తావని.. సీఎం జగన్‌ను దేవినేని సూటిగా ప్రశ్నించారు. నన్ను పది రోజులు.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపాపు.. చివరికి ఏం చేశావన్నారు దేవినేని ఉమా. తెలుగుదేశం లో ఉన్న మాజీ మంత్రులను జైలుకు పంపి ఏం సాధించలేకపోయావని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టిన వైసీపీ సర్కార్ భయపడేదీలేదని దేవినేని ఉమా స్పష్టం చేశారు..