- Telugu News Andhra Pradesh News Flood pictures in Telugu states cement lorry Rollover in Anantapur mudigubba and bridge collapse in Nirmal district
Flood Pictures: అలాంటి ఇలాంటి విచిత్రాలు కావు.. తెలుగు రాష్ట్రాల్లోని వరద సిత్రాలు.!
Flood pictures - AP - Telangana: చిన్న వరదలే కాదా? అని లైట్‌గా తీసుకుంటే.. అనూహ్య పరిణామాలు ఎదురువుతున్నాయ్. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి.
Updated on: Sep 04, 2021 | 12:04 PM

చిన్న.. పెద్ద వరదన్న తేడా లేదు. అన్నీ వాగులు, వంకలు ఇప్పుడు డేంజర్ లెవల్‌కు చేరాయి. చిన్న వరదే కాదా? అని లైట్‌గా తీసుకుంటే. ఇక్కడ చూడండి ఈ లారీ పరిస్థితి ఏమైందో..

అనంతపురం జిల్లా ముదిగుబ్బ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. యోగివేమన డ్యామ్ నీళ్లు విడుదల చేయడంతో వాగు పొంగి ప్రవహిస్తోంది. బిడ్జిపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాస్తా వరదే కాదా? అని లారీ డ్రైవర్ లైట్ తీసుకున్నాడు. లారీని ముందుకు పోనిచ్చాడు. కానీ వరదకు లారీ కిందకు కొట్టుకుపోయింది. చివరకు లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

వాటర్‌ఫాల్స్ చూడ్డానికి వెళ్లారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. చివరకు, బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. నిర్మల్ జిల్లాలో వాస్తవపూర్ జలపాతం వద్ద జరిగిందీ ఘటన.

జిల్లా కేంద్రంలోని వాస్తవ పూర్ వాటర్ ఫాల్స్ లో 18 మంది సందర్శకులు చిక్కుకున్నారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వాగు దాటే అవకాశం లేక సాయం కోసం ఎదురుచూశారు.

మూడు గంటల పాటు వరదనీటిలో భయంభయంగా గడిపారు. సాయంకోసం కేకలు వేయడంతో స్థానికులు గమనించారు.

పోలీసులకు సమాచారం అందించారు. అందరూ కలిసి పర్యాటకులను క్షేమంగా ఒడ్డుకు తీసుకురాగలిగారు.





























