Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పంట పొలాల్లోనే జలపుష్పాలు – పండగ చేసుకున్న స్థానికులు

అల్లూరి జిల్లా అడ్డతీగల మండలంలో ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు పొంగిపొర్లాయి. చెరువుల్లోని చేపలు వరద నీటితో పొలాల్లోకి రావడంతో గ్రామస్థులు చేపల వేటలో మునిగిపోయారు. కర్రలతో కొడుతూ చేపలు పడుతున్నారు. మరికొందరు దోమ తెరలను వినియోగిస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు కూడా చేపల వేటలో పాల్గొనడం విశేషం.

Ram Naramaneni
|

Updated on: Jul 03, 2025 | 4:01 PM

Share

అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో పచ్చక పరుచుకుని గ్రామాల్లో సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక పల్లెల్లోని చెరువులు, రిజర్వాయర్లు నిండుకుండల్లా మారి.. అదనంగా వచ్చిన వరద నీరు పొలాల్లోకి చేరుతోంది. ఈ వరద నీటి ప్రవాహంతో పాటు చెరువుల్లో ఉన్న చేపలు కూడా పొలాల్లోకి వచ్చిపడుతున్నాయి.

స్థానిక వీరభద్రపురం గ్రామ సమీపంలో ఉన్న జాతీయ రహదారి పక్కన ఉన్న చెరువుల్లో వరద ఉధృతికి చేపలు కలింగుల వద్ద నుంచి నేరుగా పంట పొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. దీంతో స్థానికులు కర్రలు, దోమ తెరలను చేతబట్టి చేపల కోసం పొలాల్లోకి దిగారు. వర్షపు చినుకుల్లో తడుస్తూ, బురదలో నడుస్తూ అందరూ ఎంజాయ్ చేస్తూ.. చేపల వేటలో మునిగిపోతున్నారు. అంతే కాదండోయ్… జాతీయ రహదారి మీద ప్రయాణిస్తున్న వాహనదారులు కూడా ఈ చేపల కోసం ఆరాటపడటం విశేషం. ఓ వైపు జోరు వాన, మరోవైపు జలపుష్పాల జాతర… వాటే సీన్ కదా..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
హ్యాట్సాఫ్‌! ట్రయథ్లాన్‌లో చరిత్ర సృష్టించిన.. టాలీవుడ్ హీరోయిన్.
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
నయన్‌పై ధనుష్‌తో పాటు మరో నిర్మాత సీరియస్.. 5 కోట్లకు నోటీస్‌
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
తన సినిమా ప్రివ్యూ చూస్తూ.. కుప్పకూలిన టాలీవుడ్ డైరెక్టర్
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్‌.. ఎప్పటి నుంచి అంటే
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. చిక్కుల్లో 29 మంది తారలు..
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
చిన్న తప్పుతో.. EDకి అడ్డంగా దొరికిన టాలీవుడ్ స్టార్స్
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో