అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లాలో 67వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం దొండపాడు గ్రామం నుంచి పెద్ద వడుగూరు గ్రామానికి పత్తి పంట కోతకు కూలీలతో వెళ్తోన్న

  • Publish Date - 11:21 am, Fri, 20 November 20 Edited By:
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీలకు తీవ్ర గాయాలు

Anantapur Road Accident: అనంతపురం జిల్లాలో 67వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం దొండపాడు గ్రామం నుంచి పెద్ద వడుగూరు గ్రామానికి పత్తి పంట కోతకు కూలీలతో వెళ్తోన్న ఆటోని, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూలీల్లో అందరూ మహిళలే ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read More:

రష్మిక మందన్నకు అరుదైన గుర్తింపు.. జాతీయ క్రష్‌గా మారిన గీత మేడమ్‌

అడవుల్లో పుష్పరాజ్‌.. మాసిపోయిన షర్ట్‌, ఫ్యాంట్‌తో కేక పెట్టిస్తోన్న బన్నీ లుక్‌.. చూశారా..!