Corona Fear : కరోనా సోకిందన్న భయంతో నీటి సంపులోకి దూకి వివాహితుడు ఆత్మహత్య, పెద్ద అవుటపల్లిలో ఘోరం
Corona Fear death : కృష్ణాజిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కరోనా సోకిందన్న భయంతో ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో ఓ వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు...
Corona Fear death : కృష్ణాజిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కరోనా సోకిందన్న భయంతో ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో ఓ వివాహితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక అశోక్ నగర్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని నీటి సంపులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు 30 ఏళ్ల లక్ష్మణ్. మృతుడికి భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే, వాటర్ ట్యాంక్ లోని మృతదేహాన్ని వెలికితీసేందుకు స్థానికులెవరూ ముందుకురాలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఆత్కూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వెలికితీశారు. లక్ష్మణ్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇలాఉండగా, విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ రోగుల పరిస్థితి దుర్భరంగా ఉంది. పేషెంట్ కు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కుటుంబసభ్యులకు తెలియచేయడం లేదు ఆస్పత్రి సిబ్బంది. దీంతో తమ వాళ్లు ఆస్పత్రిలో ఎలా ఉన్నారో.. అసలు బతికున్నారో… లేదో కూడా కుటుంబ సభ్యులకు తెలీని పరిస్థితి నెలకొంది. ఫలితంగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి మార్చరీలో మృతదేహాలు పేరుకుపొతోన్నాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడనుకున్నామని.. చనిపోయిన విషయమే తమకు తెలియజేయలేదని పలువురు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ యంత్రాంగం నిర్లక్ష్యపు ధోరణి పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.