AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కన్న కూతురునే చెరపట్టాలని చూసిన కసాయి తండ్రి కేసులో కోర్టు సంచలన తీర్పు..!

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీ.. కూలీ పనులు చేసుకునే లక్ష్మయ్యకు ఇరవై ఏళ్ళ క్రితమే పెళ్లైంది. ముగ్గురు ఆడ పిల్లులు ఉన్నారు. ముగ్గురు పిల్లల తర్వాత భార్యాభర్తల మద్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తను విడిచిపెట్టి భార్య వెళ్లిపోయింది. అయితే ముగ్గురు ఆడపిల్లల్లో చిన్న కుమార్తె ఐదో తరగతి చదువుతూ తండ్రే వద్ద నివసిస్తుంది.

కన్న కూతురునే చెరపట్టాలని చూసిన కసాయి తండ్రి కేసులో కోర్టు సంచలన తీర్పు..!
Guntur Court
T Nagaraju
| Edited By: Balaraju Goud|

Updated on: Aug 01, 2025 | 11:58 AM

Share

పల్నాడు జిల్లా నరసరావుపేటలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కాలనీ.. కూలీ పనులు చేసుకునే లక్ష్మయ్యకు ఇరవై ఏళ్ళ క్రితమే పెళ్లైంది. ముగ్గురు ఆడ పిల్లులు ఉన్నారు. ముగ్గురు పిల్లల తర్వాత భార్యాభర్తల మద్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తను విడిచిపెట్టి భార్య వెళ్లిపోయింది. అయితే ముగ్గురు ఆడపిల్లల్లో చిన్న కుమార్తె ఐదో తరగతి చదువుతూ తండ్రే వద్ద నివసిస్తుంది.

గత ఏడాది 2024 సెప్టెంబర్ 7వ తేదీన లక్ష్మయ్య ఫుల్‌గా మద్యం సేవించాడు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన లక్ష్మయ్య.. పదేళ్ల వయస్సున్న కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. తండ్రి ప్రవర్తన అసహజంగా అనిపించడంతో కుమార్తె బిత్తరపోయింది. వెంటనే తేరుకుని పక్కనే ఉన్న స్వచ్చంద సంస్థ ప్రతినిధులకు చెప్పింది. లక్ష్మయ్య మద్యం మత్తులో ఉండటాన్ని గమనించి, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన ఐసిడిఎస్ అధికారులు బాలిక ఇంటికి చేరుకుని ఆమెను అక్కున చేర్చుకున్నారు. లక్ష్మయ్య వింత ప్రవర్తన గమనించి అధికారులు వెంటనే టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

లక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్న టూటౌన్ సిఐ హైమరావు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గుంటూరు పోక్సో కోర్టులో కేసు విచారణ నడిచింది. నేరారోపణ రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి సుల్తానా బేగం నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించారు. అయితే పది నెలల్లోనే నేరం రుజువై నిందితుడికి శిక్ష పడటాన్ని స్థానికులు స్వాగతించారు. మహిళలు, బాలికలపై దాడులు, లైంగిక వేధింపుల అంశంలో సత్వరమే న్యాయం జరిగి నిందితులకు శిక్ష పడితే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని టూ టౌన్ సిఐ హైమారావు అన్నారు. వేగంగా కేసు దర్యాప్తు చేయడమే కాకుండా ఆధారాలు సేకరించి శిక్ష పడేలా చేసిన సిఐ హైమారావు, ఏపిపి బర్కత్ ఆలీని స్వచ్చంద సంస్థ ప్రతినిధులు అభినందించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..