Andhra Pradesh: వన్య ప్రాణిని చంపి, దహనం చేసిన రైతులు! చనిపోయిన ఆ వన్య ప్రాణి ఏమిటో.. చంపిందెవరో?
అది నల్లమల అటవీ ప్రాంతం. నల్లమల ముఖద్వారంగా పేరు గాంచిన వెల్తుర్ధి మండలం పిచ్చంబావి తండా దగ్గర అటవీ ప్రాంతం మొదలైన చోట కాలిన ఆనవాళ్లు కలకలం రేపాయి. పారెస్ట్ లో ఏదో జంతువును కాల్చి వేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏం జరిగి ఉంటుందో అన్న అంశంపై విచారణ ప్రారంభించారు. అయితే అసలేం జరిగిందో ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అయితే వెల్తుర్ది మండలం పిచ్చంబావి తండా వద్ద..
వెల్తుర్ది, డిసెంబర్ 20: అది నల్లమల అటవీ ప్రాంతం. నల్లమల ముఖద్వారంగా పేరు గాంచిన వెల్తుర్ధి మండలం పిచ్చంబావి తండా దగ్గర అటవీ ప్రాంతం మొదలైన చోట కాలిన ఆనవాళ్లు కలకలం రేపాయి. పారెస్ట్ లో ఏదో జంతువును కాల్చి వేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏం జరిగి ఉంటుందో అన్న అంశంపై విచారణ ప్రారంభించారు. అయితే అసలేం జరిగిందో ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. అయితే వెల్తుర్ది మండలం పిచ్చంబావి తండా వద్ద ఫారెస్ట్ భూమిని కొంతమంది రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వన్య ప్రాణులు తరుచూ పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి. దీంతో రైతుల పంటలపై వన్య ప్రాణులు దాడులు చేయకుండా విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే విద్యుత్ కంచెలకు తగిలి అటవీ జంతువు మరణించినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో భయభ్రాంతులకు గురైన రైతులు గుట్టుచప్పుడు కాకుండా వన్య ప్రాణిని అటవీ ప్రాంతంలో కాల్చివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే రైతులు అంతగా భయపడటానికి ప్రధానం కారణమైన ఆ జంతువు ఏంటా అన్న భావన వ్యక్తం అవుతోంది. చిరుత లేదా పెద్ద పులి మరణించి ఉండటంతోనే ఆందోళనకు చెందిన రైతులు తమపై కేసు నమోదు కాకుండా తగలబెట్టి ఉంటారన్న నమ్మకం బలపడుతుంది.
గతంలో పల్నాడు జిల్లాలోని దుర్గి మండలంలో రెండు పెద్ద పులలు సంచరించి కలకలం రేపాయి. అటవీ ప్రాంతంలో నీటి లభ్యత తగ్గిపోవడంతో గ్రామ సరిహద్దులోకి వచ్చి ఉంటాయని అధికారులు భావించారు. అంతేకాకుండా గజాపురం పెద్ద పెద్ద పులులు ఆవుపై కూడా దాడి చేశాయి. అటు తర్వాత ఆ రెండు పులలు కూడా నలమల డీప్ ఫారెస్ట్ లోకి వెళ్లిపోయినట్లు అధికారులు తేల్చి చెప్పారు. వేసవి ముగిసిన తర్వాత రెండు పులల జాడలు కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో పల్నాడు జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే పిచ్చంబావి తండా వద్ద గుర్తు తెలియని జంతువు కాల్చి వేశారన్న ప్రచారం తిరిగి పులలు జాడపై అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. అయితే పూర్తిగా కాలిపోయిన ప్రాంతంలో దొరికిన ఎముకులను అటవీ అధికారులు పోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ జంతువు ఏంటి అనే అంశంపై స్పష్టత వస్తుందంటున్నారు. ఆ తర్వాతే జంతువును కాల్చివేసిన దుండగులను కూడా కనిపెట్టే అవకాశం ఉందంటున్నారు. అటవీ శాఖాధికారులు మాత్రం ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగెలను అక్రమంగా ఏర్పాటు చేసి జంతువు మ్రుతికి కారణమయ్యారంటూ కేసులు పెడతారన్న భయంతోనే రైతులు జంతువును కాల్చి వేసి ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.