Covid 19: కరోనా కొత్త వేరియంట్‌పై కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..

కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటికే పలు మరణాలు కూడా సంభవించాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్‌ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జేఎన్‌1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై...

Covid 19: కరోనా కొత్త వేరియంట్‌పై కీలక ప్రకటన చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ..
Corona Virus
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 20, 2023 | 9:37 AM

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అంతా సంతోషిస్తున్న వేళ ఇప్పుడు కొత్త వేరియంట్ మళ్లీ గుబులు రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ సబ్‌వేరియంట్‌ జేఎన్‌1 కేసులు పెరుగుతుండడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో తొలుత ఈ వేరియంట్‌ కేరళలో వెలుగు చూసింది.

కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఇప్పటికే పలు మరణాలు కూడా సంభవించాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్‌ చేసింది. అయితే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్‌ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. జేఎన్‌1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని తేల్చి చెప్పింది. దీనిని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా వర్గీకరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్‌ ప్రభావం చాలా తక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్‌.1తోపాటు ఇతర వేరియంట్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ కరోనా కొత్త వేరియంట్‌ తొలిసారి ఈ ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో వెలుగులోకి వచ్చింది. చైనా, సింగపూర్‌తో పాటు పలు దేశాల్లో ఈ సబ్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మంగళవారం.. కొత్తగా నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 402 మందికి పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇక ఏపీలోనూ కరోనా కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో అడపాదడపా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర అలర్ట్ అయ్యింది.

ఇందులో భాగంగానే నేడు (బుధవారం) రాష్ట్రప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనుంది. ఈ కాన్ఫరెన్స్‌కు మంత్రితోపాటు ఆరోగ్య కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకుడు హాజరు కానున్నారు. కేంద్రం ఇచ్చే మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోనున్నారు. కొవిడ్‌ టెస్ట్‌ల సంఖ్యను పెంచడం.. మెడికల్‌ కిట్లు, మందులను ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచడం.. గాంధీ ఆస్పత్రిలో ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..