Palnadu: ‘పొద్దంతా కూకోబెట్టి.. పని చెయ్యకుండా పంపుతారా..?’ తహసీల్దారును అడ్డగించిన రైతు

ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన రైతు కంచేటి చంద్రరావు శుక్రవారం తహసీల్దారు ఆఫీసు ముందు బైఠాయించి పొలంలో సాగు నీటి సదుపాయం ఉన్నట్లుగా బోరు ధ్రువపత్రం సాధించుకున్నాడు. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Palnadu: 'పొద్దంతా కూకోబెట్టి.. పని చెయ్యకుండా పంపుతారా..?' తహసీల్దారును అడ్డగించిన రైతు
Farmer Protest
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 08, 2024 | 12:14 PM

ఆయనొక రైతు… పేరు కంచేటి చంద్రరావు..ఊరు పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల… తన పొలానికి విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దీని కోసం తహశీల్ధారు సంతకం అవసరమవ్వడంతో ఆయన శుక్రవారం తహశీల్ధారు కార్యాలయానికి వచ్చాడు.

తన దరఖాస్తును తహశీల్దారు కార్యాలయంలో అందించాడు. దరఖాస్తును పరిశీలించిన తహశీల్ధారు నళిని.. వీఆర్వోను వెరిఫై చేయమని ముప్పాళ్లకు పంపించింది. దీంతో రైతు తహశీల్ధారు కార్యాలయంలోనే ఉండిపోయాడు. ముప్పాళ్ల వెళ్లిన విఆర్వో రైతు చంద్రరావు గురించి… ఎంక్వైరీ చేసి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్దం చేసి కార్యాలయంలో అందించాడు. ఇంకేంముంది తనకు అనుమతి లభిస్తుందని ఆశించిన రైతుకు అశాభంగం ఎదురైంది.

వీఆర్వో నివేదిక ఇచ్చేటప్పటికీ సమయం ఐదు గంటలైంది. దీంతో తహశీల్ధారు నళిని కార్యాలయం నుండి వెళ్లిపోయేందుకు కారు ఎక్కింది. దీంతో నిరాశ చెందిన రైతు కార్యాలయం గేటు వద్ద తహశీల్ధారు కారుకు అడ్డంగా కూర్చొన్నాడు. ఉదయం నుండి తహశీల్దారు సంతకం కోసం వేచి ఉంటే సంతకం పెట్టకుండా వెళ్లపోవడాన్ని ప్రశ్నించాడు. అయితే ఐదు గంటల తర్వాత తాను సంతకాలు చేయనని తహశీల్ధారు చెప్పడంతో రైతు ఆవేదన చెందాడు. దీంతో కారు ముందు కూర్చొని నిరసన తెలిపాడు. తన ఫైల్ మీద సంతకం చేసే వెళ్ళాలని పట్టుబట్టాడు.

దీంతో కంగుతిన్న రెవిన్యూ సిబ్బంది రైతుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే రైతు నిరసన విరమించేందుకు నిరాకరించాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి చంద్రరావుకు సర్ధి చెప్పారు. నిరసన విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమయం మించి పోయిన తర్వాత పట్టుబట్టకూడదని సూచించారు. అయినప్పటికీ రైతు పట్టు వీడకపోవడంతో.. చేసేది లేక అధికారులు..  చంద్రరావుకు ధ్రువపత్రం అందజేశారు. దీంతో ఆ రైతు శాంతించాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
అంబానీ ఇంట మిన్నంటిన గణేష్ చతుర్థి వేడుకలు.. వీడియో చూడండి
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
ఇదేంది రాజా.. ఇలా జరుగుతోంది.? రాజ్ తరుణ్ కి బిగ్ షాక్.!
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
మళ్లీ గోదావరి ఉగ్రరూపం.! పెరుగుతున్న వరద ప్రవాహం..
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన గేమ్‌ ఛేంజర్ టీం | జూనియర్ నటసింహం.
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
ఒక్క చుక్క వేస్తే రీడింగ్‌ గ్లాసెస్‌ అవసరమే ఉండదు.! ‘ప్రెస్‌వూ’
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మరో అల్పపీడన గండం.. రెడ్ అలెర్ట్.!
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
కన్నుల పండుగగా 70 అడుగుల ఖైరతాబాద్ గణనాధుడు..
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌.. కొత్త పంచాయతీ.!
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
అంబాజీ మాతాకు కేజీ బంగారం విరాళం.. ఆలయ శిఖరానికి బంగారు తాపడం.
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు
మహిళ కడుపులో శిశువు ఎముకల గూడు.. స్కానింగ్ లో పుర్రె, శరీర ఎముకలు