AP: తహశీల్దారు ఆఫీసులో నిట్టనిలువునా కుప్పకూలి మరణించిన రైతు.. కన్నీరు పెట్టించే కథనం

దశాబ్దాల కల చెరిగింది...ఓ రైతు గుండె చెదిరింది. పిడికెడు అన్నం పెట్టే మట్టి కోసం ఆ రైతు గుండె ఆగింది. స్పందన లేని అధికారులను చూసి రైతు హృదయ స్పందన ఆగింది. నలభయ్యేళ్ళ అక్రమాన్ని ధిక్కరించిన రైతు గొంతు మూగవోయింది.

AP: తహశీల్దారు ఆఫీసులో నిట్టనిలువునా కుప్పకూలి మరణించిన రైతు.. కన్నీరు పెట్టించే కథనం
Fartmer Dies
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 04, 2022 | 6:12 PM

Andhra Pradesh: చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దారు కార్యాలయంలో పోరాడి ఓడిన ఓ రైతు గుండె ఆగి మృత్యువు ఒడికి చేరాడు. ఇదే హృదయ విదారక దృశ్యం ఇప్పుడు మనసున్న ప్రతి మనిషినీ గుండెలు పిండేస్తోంది. మనిషన్న ప్రతి వాడి హృదయాన్నీ కలచివేస్తోంది. భూమికీ రైతుకీ ఉన్న సంబంధం తరతరాలది. భూమి కోసం మనిషి బతుకుతాడు. చివరకు మృత్యువుని సైతం కౌగిలించుకుంటాడు. చావడానికైనా సిద్ధమౌతాడు. కానీ జానెడు భూమిని అన్యాయంగా ఆక్రమిస్తే మాత్రం విశ్రమించడు. పోరాటానికి సిద్ధమౌతాడు. ప్రాణాలకు తెగిస్తాడు. తన భూమికోసం చివరకు ప్రాణాలు సైతం విడుస్తాడు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణే చిత్తూరు రైతు ఏసురత్నం. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రాజా ఇండ్లు గ్రామానికి చెందిన ఏసురత్నం న్యాయం కోసం పోరాడి ఓడిపోయాడు. అందరూ చూస్తుండగానే అధికారుల ఆధిపత్యధోరణికి ఉన్నఫళంగా కుప్పకూలిపోయాడు.  తహశీల్దారు కార్యాలయంలోనే నిట్టనిలువునా కుప్పకూలి, మృతిచెందిన రైతు దృశ్యం అందర్నీ కంటతడిపెట్టిస్తోది. ఇదే యిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలింతకీ ఏం జరిగింది? రైతు గుండె ఎందుకు ఆగింది..?

పెనుమూరు మండలం, రామకృష్ణాపురం పంచాయితీలోని రాజా ఇండ్లు గ్రామానికి చెందిన ఏసురత్నంకి చెందిన సర్వే నంబర్‌ 918బై 4 లోని భూమికి 1974లో లీజు పట్టా ఇచ్చారు. అయితే దళితుడైన ఏసురత్నంకి భూమిని దక్కకుండా చేసేందుకు తిమ్మరాజు కండ్రిగ గ్రామస్తులు తరచూ అడ్డుతగులుతున్నారు. దీంతో విసిగిపోయిన రత్నం కోర్టుకెక్కాడు.  2009లో చిత్తూరు న్యాయస్థానం ఆ భూమి అక్షరాలా ఏసురత్నంకే దక్కుతుందని పర్మినెంట్‌ ఇంజంక్షన్‌ ఆర్డర్‌ ఇష్యూ చేసింది. అయినా ఏసురత్నం కల నెరవేర లేదు. దేవుడు వరమిచ్చినా అధికారులు కాలడ్డుపెట్టారు. ఓ దళితుడికి భూమి ఎందుకనుకున్నారో ఏమో కండ్రిగ గ్రామస్తులు మళ్ళీ మళ్ళీ రత్నాన్ని ముప్పతిప్పలు పెడుతూనే ఉన్నారు. అధికారులు సైతం కోర్టు ఆదేశాలను సైతం తోసిరాజంటూ గ్రామస్తులకే వత్తాసుపలికారు.

ఓ దళితుడు తెల్లగుడ్డలేసుకుంటే భరించలేరొకచోట. ఓ దళితబిడ్డ అగ్రవర్ణాలతో పాటు ఉన్నత చదువులు చదువుకుంటే చంపేస్తారొక చోట. ఓ దళిత స్త్రీ ఒంటరిగా కనిపిస్తే చెరిచేస్తారింకో చోట. అలాంటి వ్యవస్థలో ఇక ఓ దళితుడికి భూమి ఉంటే….ఊరుకుంటారా? చంపేస్తారు. ఇక్కడా అదే జరిగింది. అదే చిత్తూరు జిల్లాలో కండ్రిగ గ్రామస్తులకు కన్నుకుట్టింది. అదే అహంభావం ఏసురత్నాన్ని అడ్డకుంది. రత్నాన్ని సాగుచేసుకోనివ్వకుండా అడ్డుకున్నారు కండ్రిగ గ్రామస్తులు.

ఇది చాలదన్నట్టు ఇటీవలే రత్నానికి చెందిన భూమిలో కొందరు పక్కా ఇళ్ళు నిర్మించుకున్నారు. దళితుడి భూమి కదా మరి….అందరికీ చులకనే… ఈ విషయంలోనూ రత్నం ఊరుకోలేదు. కోర్టుకెళ్ళారు. nనాలుగు రోజుల క్రితం మిగిలిన భూమిని చదును చేసేందుకు ప్రయత్నించిన ఏసురత్నాన్ని వీఆర్వో వెళ్ళి పనులు చేయకూడదంటూ ఆపేశారు. అదే రోజు తహశీల్దారు రమణిని కలిసి సమస్యను పరిష్కరించాలంటూ వేడుకున్నాడు ఏసురత్నం. అయినా ఫలితం శూన్యం. తన సర్వస్వం అదే రెండున్నరెకరాల భూమి. అది లేకపోతే తనకు బతుకే లేదు. అందుకే మళ్ళీ పోరుబాట పట్టాడు. తన భూమికోసం కోర్టు ఇచ్చిన ఆర్డరుని అమలు చేయాలంటూ రత్నం తహశీల్దారు కార్యాలయంలోనే బైఠాయించాడు. శుక్రవారం నుంచి తహశీల్దారు కార్యాలయం వద్ద నిరసన దీక్ష చేపట్టాడు. రెండు రోజుల పాటు రైతు ఒంటరిగా భూమికోసం పోరాడాడు.

శనివారం మధ్యాహ్నం పోలీసులు ఎంటర్‌ అయ్యారు. పోలీసుల ముందే అధికారులు దళితుడైన ఏసురత్నం పైన అజమాయిషీ చేయాలని చూశారు. నీకు పని కావాలా గొడవ కావాలా అంటూ అధికారులే రైతుతో గొడవ పడ్డారు. వీరలెవెల్లో ఓ అమాయకుడిపై తమ తెలివితేటలు ప్రదర్శించారు. తనకేదీ ఒద్దు… తనకి కావాల్సింది ఆ మట్టి ఒక్కటేనని గుండెలు బిగబట్టి చెప్పే ప్రయత్నం చేశాడు రైతు రత్నం. ఆ రైతు గుండెలు చించుకుని అరిచినా అధికారులకు అది అర్థమయితే సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది. కానీ కాలేదు.  రైతు తన పోరాడి ఓడిపోయాడు. న్యాయం చేయమంటూ అధికారుల చుట్టూ తిరిగి అధికారుల్లో నాటుకుపోయిన అలసత్వానికి బలయ్యాడు. పోరాడి … పోరాడి చివరకు పట్టించుకునే దిక్కులేక, అధికారుల నిర్లక్ష్యానికి గురై నిట్టనిలువునా కుప్పకూలిపోయాడు. తహశీల్దారు కార్యాలయంలోనే తుదిశ్వాస వీడాడు.

గుండెలవిసిపోయే ఈ ఘటనతో ఆ రైతు కుటుంబం తల్లడిల్లింది. పెనుమూరు తహసిల్దార్ కార్యాలయం ముందు రత్నం కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు స్థానికులు. పెనుమూరు తహసిల్దార్ కార్యాలయంలో మృతి చెందిన రైతు కుటుంబంతో అర్ధరాత్రి వరకు చిత్తూరు ఆర్డీవో చర్చలు జరిపారు. వడ్డెర సంఘం నేతలు ప్రజా సంఘాలతో చర్చలు జరిపారు ఆర్డిఓ రేణుక.

కలెక్టరు హామీ ఇస్తే తప్ప రైతు భౌతిక కాయానికి అంత్యక్రియలు చేయమని తేల్చి చెప్పారు కుటుంబ సభ్యులు, స్థానికులు. భూమిపై హక్కు కోసం 40 ఏళ్లకు పైగా పోరాటం చేసి తహసిల్దార్ కార్యాలయంలోనే తుది శ్వాస విడిచిన రత్నం మరణంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. బాధిత కుటుంబం డిమాండ్లపై ఫోన్లో మాట్లాడడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ బాధితులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం.. 

పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..