AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంద్రకీలాద్రిపై ఫేక్ అర్చకుడి వివాదం.. నకిలీ పత్రాలతో ఉద్యోగ యత్నం?

Fake Priest Appointment Attempt Exposed at Indrakeeladri Temple: నామయ్య అనే అర్చకుడి పేరుతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో ఈ వ్యవహారం వెనుక పునరావృత ప్రయత్నాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, సంబంధిత పత్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా పొందినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇంద్రకీలాద్రిపై ఫేక్ అర్చకుడి వివాదం.. నకిలీ పత్రాలతో ఉద్యోగ యత్నం?
Indrakeeladri
M Sivakumar
| Edited By: |

Updated on: Apr 09, 2026 | 12:14 PM

Share

ఇంద్రకీలాద్రిపై మరో సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. నకిలీ డాక్యుమెంట్లతో అర్చక ఉద్యోగాన్ని కాజేయడానికి ప్రయత్నించిన ఘటన ఇప్పుడు దేవస్థాన వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చనిపోయిన అర్చకుడి పేరును ఉపయోగించి వారసుడిగా ఎంట్రీ ఇవ్వాలన్నయత్నం బయటపడటంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.

శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన అర్చకుడు లింగాల సాయిబాబు 2022లో మరణించారు. ఆయన స్థానంలో వారసత్వ హక్కు ఉందని పేర్కొంటూ లింగాల దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఉద్యోగానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియలో దత్తతకు సంబంధించిన పత్రాలు నకిలీవని ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యక్తి గతంలో కూడా ఇలాంటి ప్రయత్నం చేసినట్టు చెబుతున్నారు. 2009లో నామయ్య అనే అర్చకుడి పేరుతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో ఈ వ్యవహారం వెనుక పునరావృత ప్రయత్నాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు, సంబంధిత పత్రాల ఆధారంగా అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా పొందినట్టు ప్రచారం జరుగుతోంది. దీనితో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ విధానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ విషయాన్ని తాడేపల్లికి చెందిన కోడూరు లక్ష్మీ పద్మావతి వెలుగులోకి తీసుకువచ్చారు. తన చిన్నాన్న లింగాల సాయిబాబు పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ పత్రాలతో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె దేవస్థాన ఈవో శీనా నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు అనంతరం అధికారులు అప్రమత్తమై దిలీప్ కుమార్ నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని బాధితురాలు కోరుతున్నారు.ఇదిలా ఉండగా, కమిషనర్ కార్యాలయంలో పత్రాల పరిశీలన సరైన విధంగా జరగలేదని కొంతమంది అర్చకులు ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ ద్వారా నిజాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అర్చక నియామకంపై వచ్చిన ఈ ఆరోపణలు దేవస్థాన పరిపాలనపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నకిలీ పత్రాల వినియోగం జరిగిందా, లేక ఆరోపణలకే పరిమితమా అన్నది అధికారిక విచారణ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఆ రూట్‌లో ఏడాది పాటు ట్రాఫిక్ ఆంక్షలు
పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌...
పోట్లగిత్తల బరిలో ట్రాన్స్‌జెండర్‌...
అయ్యో దేవుడా ఎంతపనైంది.. మనిషి ప్రాణం తీసిన మటన్ కర్నీ! ఏమైందంటే
అయ్యో దేవుడా ఎంతపనైంది.. మనిషి ప్రాణం తీసిన మటన్ కర్నీ! ఏమైందంటే
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఈ సూపర్ స్కీమ్‌తో రూ.44 వేలకే..
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
మీ పాదాల ఆకారాన్ని బట్టి.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
వాట్సప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా ఎలా సెట్ చేసుకోవాలి..?
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఒక దశలో చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు గట్టి పోటీ
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
ఇంట్లో వింత శబ్దాలు.. ఏంటా అని చూస్తే గుండె ఆగినంత పనైంది..
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే
స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ హెల్తీ స్టార్టర్ ఇస్తే ఎగిరి గంతే