AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలవరం ప్రాజెక్టుపై విస్తృతంగా మేథోమథనం.. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి టార్గెట్ ఫిక్స్!

టార్గెట్ ఫిక్స్ అయింది. పోలవరం ప్రొజెక్టుపై జరిగిన మేథోమథనం కొలిక్కొచ్చేసింది. కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఓ క్లారిటీ ఇచ్చేశారు విదేశీ నిపుణులు. పాత డయాఫ్రమ్ వాల్‌కి 6 మీటర్ల ఎగువన కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని, గరిష్టంగా పదిహేను నెలల్లోగా..

పోలవరం ప్రాజెక్టుపై విస్తృతంగా మేథోమథనం.. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి టార్గెట్ ఫిక్స్!
Polavaram Project
Ravi Kiran
|

Updated on: Nov 08, 2024 | 8:15 PM

Share

ఆంధ్రుల జీవనాడి.. పోలవరం ప్రాజెక్ట్‌.. నిర్మాణ దశను దాటలేక దశాబ్దాల తరబడి అపసోపాలు పడుతూనే ఉంది. ప్రభుత్వాలు మారినా కొత్తకొత్త సమస్యలతో నిర్మాణంలో అంతులేని జాప్యం తప్పడం లేదు. కొత్త సమస్యల్లో అతికొత్త సమస్య ఏంటంటే.. ప్రాజెక్టు దగ్గర గోదావరి లోపల నిర్మించిన డయాఫ్రం వాల్ భారీ వరదలకు దెబ్బతినడం..! 2018లో ఉభయగోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీ గర్భంలో 93.5 మీటర్ల లోతులో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ ఇది. రెండు సీజన్లలో 412 రోజుల కాల వ్యవధిలో పూర్తయినప్పటికీ 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా దెబ్బతినింది. దీంతో దీని మీద నిర్మించాల్సిన మెయిన్ డ్యామ్ పనులు ఆగిపోయాయి. ఇటీవలే మళ్లీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు కొత్త డయాఫ్రమ్‌ వాల్‌పై దృష్టి పెట్టారు. విదేశీ నిపుణుల సలహాలు-సూచనలతో ముందుకెళ్లాలని నిర్ణయించారు.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

కేంద్ర జలసంఘం సీఈ విజయ్ శరన్ అధ్యక్షతన ముగ్గురు విదేశీ నిపుణులతో పరిశీలన బృందం ఏర్పాటైంది. ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందం.. పోలవరంపై మేథోమథనం చేసింది. రెండురోజుల పాటు ఎగువ-దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలను పరిశీలించింది. దీనికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ చూసి, పోలవరం ఆధారిటీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. గ్యాప్‌-2లో డయాఫ్రం వాల్‌ ప్లాట్‌ఫాం, వాల్‌ నిర్మాణానికి అవసరమైన ఓడోమీటర్లు, కొత్త వాల్‌ నిర్మాణం కోసం ఎర్త్‌ కమ్ రాక్‌ఫిల్‌ డ్యామ్ కుడివైపు జరుగుతున్న మట్టి పనులు, దిగువ కాఫర్‌ డ్యాం వద్ద డీవాటరింగ్‌ పనులు.. అన్నిటినీ నిశితంగా పరిశీలించారు. ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో కేంద్ర జలసంఘం ఛైర్మన్‌ కూడా ఈ సంప్రదింపుల్లో పాల్గొన్నారు. అటు.. ఆఫ్రి సంస్థ సిద్ధం చేసిన కొత్త డయాఫ్రమ్ వాల్, ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించింది. పాత డయాఫ్రం వాల్‌కు ఎగువన 6 మీటర్ల దూరంలో కొత్త డయాప్రం వాల్ నిర్మించాలని, ఇసుక సాంద్రత పెంచి మరింత గట్టిదనం తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే

కానీ.. డిజైన్‌పై విదేశీ నిపుణులు అనేక సందేహాలు లేవనెత్తారు. కొన్ని వివరణలూ కోరారు. అన్నిటిపై క్లారిటీ ఇస్తామంటోంది ఆఫ్రి సంస్థ. డ్యామ్ ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు, తక్కువ నీళ్లు ఉన్నప్పుడు, గరిష్ట స్థాయిలో నీళ్లు ఉన్నప్పుడు… ఇలా వివిధ కోణాల్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి దాదాపు 15 నెలల టైమ్ పడుతుందని ఒక అంచనాకొచ్చారు. యంత్రసామగ్రిని పెంచుకుంటే నిర్మాణ గడువు తగ్గే ఛాన్స్ కూడా ఉందట. నిపుణుల భేటీ తర్వాత సీఎం చంద్రబాబు క్షేత్ర స్ధాయిలో పోలవరం పర్యటనకు వస్తారు. పనుల పరిశీలన ముగిశాక అధికారులతో సమావేశమై కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై ఫైనల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇది చదవండి: 90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే స్టన్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..