AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ.! సాక్షిగా కోర్టుకొచ్చాడు.. చివరికి ముద్దాయిగా జైలుకెళ్లాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే

ఈ వ్యక్తి ఓ హత్య కేసులో సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు వచ్చాడు.. కట్ చేస్తే.. జడ్జి ఆగ్రహానికి గురై సరాసరి జైలు పాలయ్యాడు. అసలు ఇంతకీ ఆ మ్యాటర్ ఏంటో తెలిస్తే మీరు షాక్ కావడం ఖాయం.. ఆ వివరాలు ఇలా..

ఓర్నీ.! సాక్షిగా కోర్టుకొచ్చాడు.. చివరికి ముద్దాయిగా జైలుకెళ్లాడు.. అసలు మ్యాటర్ తెలిస్తే
Judgement
Maqdood Husain Khaja
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 08, 2024 | 7:28 PM

Share

ఒక హత్య కేసు.. కేసు కోర్టుకు వెళ్లింది.. సాక్ష్యం చెప్పడానికి ఓ పెద్దమనిషి వచ్చాడు.. అంతవరకు బాగానే ఉంది.. కానీ ఆ పెద్దమనిషి కోర్టు ఆగ్రహానికి గురయ్యాడు.. సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఒక రోజు జైలు పాలయ్యాడు. జరిమానా కూడా అతని తలపై పడింది. అతను చేసిన తప్పేంటో తెలుసా..! తప్ప తాగి కోర్టుకి వచ్చాడు.. అదే అతడ్ని జైలు పాలయ్యేలా చేసింది.

ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్

మద్యం మత్తులో హత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వచ్చిన వ్యక్తికి ఒకరోజు జైలు, జరిమానా విధించింది అనకాపల్లి 11వ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు. అనకాపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రకటించిన వివరాల ప్రకారం.. సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హత్య కేసులో తాపీ మేస్త్రీ అయిన గొర్లె సత్తిబాబు సాక్ష్యం చెప్పేందుకు సిద్ధమయ్యాడు. అనకాపల్లి పదో అడిషనల్ సెషన్స్ జడ్జ్ కోర్టుకు వెళ్లాడు. యాభై అయిదేళ్ల గొర్లి సత్తిబాబు స్వగ్రామం సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామం. సాక్ష్యం చెప్పేందుకు వచ్చిన సత్తిబాబు కోర్టు ఆగ్రహానికి గురయ్యాడు. సత్తిబాబు తప్ప తాగి రావడంతో అనుమానం వ్యక్తం చేసిన కోర్టు వెంటనే వెరిఫై చేయాలని పోలీసులకు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో అనకాపల్లి టౌన్ పోలీసులు సత్తిబాబుకు డ్రంకన్ టెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: 90’s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌లో నటించిన ఈ అమ్మడు ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే స్టన్

మద్యం తాగి సాక్ష్యం చెప్పేందుకు వచ్చినట్టు తేలడంతో ఇన్స్పెక్టర్ టీవీ.విజయ్ కుమార్.. సత్తిబాబుపై పెట్టీ కేసు నమోదు చేశారు. అనకాపల్లి పరిధిలోని 11వ అడిషనల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు నిందితుడుని హాజరు పరచారు. దీంతో జడ్జి.. తప్ప తాగి సాక్ష్యం చెప్పేందుకు వచ్చినందుకు 24 గంటల ఖారాగార శిక్ష, 50 రూపాయల జరిమానా విధించారు. దీంతో నిందితుడు సత్తిబాబును అనకాపల్లి సబ్ జైలుకు తరలించామని అన్నారు అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ విజయ్ కుమార్. చూశారుగా.. కోర్టు ఆగ్రహానికి గురైతే అంతే సంగతులు. అందుకే కేవలం నిందితులకే శిక్ష కాదు.. కేసుల్లో సాక్ష్యం చెప్పేందుకు వచ్చినవాళ్ల ప్రవర్తన సరిగా లేకున్నా.. తాగి సాక్ష్యం చెప్పేందుకు వచ్చినా.. క్రమశిక్షణ లేకుండా వ్యవహరించినా కోర్టు ఆగ్రహానికి గురికాక తప్పదు.

ఇది చదవండి: బాలికతో హోటల్ రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా.. ఆమె ఏం చేసిందంటే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..