Crypto Currency Scam: ఈడు ఎవడ్రా బాబు.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నాడు..

10 లక్షలు ఇస్తే... నెలకు లక్ష రూపాయలు వడ్డీ అని ఆశ చూపించాడు. కొందరికి చెప్పినట్లుగానే నెల నెల వడ్డీ నగదుగా ఇచ్చాడు. మరికొందరికి చెక్కులు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నాడు. ఇంకేముంది.. కోట్లు కోట్లు అప్పుగా ఇచ్చారు.. కొద్దిరోజుల తర్వాత డబ్బులు ఇవ్వడం ఆగిపోయింది. మనిషి కనిపించలేదు. ఇచ్చిన వాళ్లంతా సొసైటీలో పరువు ఉన్నవారు కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేక బయటకు చెప్పుకోలేక లోలోపల కుమిలిపోయారు.

Crypto Currency Scam: ఈడు ఎవడ్రా బాబు.. మోసం చేయడంలో పీహెచ్‌డీ చేసినట్లు ఉన్నాడు..
In The Name Of Crypto Currency Fraudster Who Collected 25 Crore
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 08, 2024 | 6:50 PM

అతని పేరు రామాంజనేయులు.. అనంతపురంలో మొదట డీఎస్సీ కోచింగ్ పేరుతో బాధితులకు దాదాపు రూ.90 లక్షల వరకు టోపీ పెట్టాడు. ఆ తర్వాత మకాం కోస్గికి మార్చాడు. ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేరాడు. ఇది బాగోలేదని పారిశ్రామికవేత్తగా అవతారం ఎత్తాడు. ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రూపమే లేని, ఫిజికల్‌గా కనిపించని క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో ఫైనాన్స్, ఓకే ఎక్స్ యాప్ లలో డబ్బులు ట్రేడింగ్ చేస్తే మంచి ఫలితాలు లాభాలు వస్తాయని పదిమందికి చెప్పాడు. అది కూడా పెద్ద ఎత్తున ప్రచారమైంది. బాగా లాభాలు ఉన్నాయి డబ్బులు ఇస్తే మరింత లాభాలు వస్తాయని నమ్మించాడు. రూ.10 లక్షలు ఇస్తే లక్ష రూపాయలు నెలకు ఇస్తా అని చెప్పాడు. కొందరికి నెల నెల వడ్డీ ఇచ్చాడు. మరికొందరికి చెక్కులు రాసిచ్చాడు. కోట్లకు కోట్ల రూపాయలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి.

దాదాపు రూ.26 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తుంది. నంద్యాల జిల్లా డోన్ కేంద్రంగా జరిగిన ఈ క్రిప్టో కరెన్సీ స్కాం పెద్ద ఎత్తున పాకిపోయింది. డోన్‌కు చెందిన ప్రముఖులు కూడా ఇందులో ఉన్నారు. పోలీసులు టీచర్లు వైద్యులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం ఇందులో పెట్టుబడిగా పెట్టారు. డోన్ తో పాటు పియాపిలి, బేతంచెర్ల వెల్దుర్తి పత్తికొండతో పాటు నంద్యాల, కర్నూలు అనంతపురం, కడప మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వందలాది మంది డబ్బులు తెచ్చి ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. మనిషి కనిపించలేదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఆ నోట ఈ నోటపడి పోలీసులకు సమాచారం వచ్చింది. ఫిర్యాదు లేకుండా కొందరు రహస్యంగా పోలీసులకు వచ్చి చెప్పారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి రామాంజనేయులును పట్టుకున్నారు. విచారించారు. నిజమే అని అంగీకరించినట్లు సమాచారం. ఇంతవరకు బానే ఉంది కానీ బాధితులకు రికవరీ చేసి ఎలా ఇవ్వాలనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.

45 రోజులుగా ఇదే విచారణ కొనసాగుతూనే ఉంది. ఉదయం అతడు పోలీస్ స్టేషన్‌కు రావడం రాత్రికి ఇంటికి పంపించడం జరుగుతోంది. దీంతో బాధితులు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. రామాంజనేయులు అకౌంట్లో కొంత నగదు ఉన్నట్లు సమాచారం. అయితే వసూలు చేసింది రూ.26 కోట్లకు పైగా ఉండటంతో.. ఉన్న నగదు ఏమాత్రం సరిపోదు. అతనికి ఏమైనా స్థిర చర ఆస్తులు ఉన్నాయా అనేదానిపై కూడా విచారణ జరుగుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి