Janasena Glass Tumbler: జనసేనకే గాజు గ్లాసు గుర్తు.. ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది కేంద్రం ఎన్నికల సంఘం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించింది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కేంద్ర ఎన్నికల కమిషన్.

Janasena Glass Tumbler: జనసేనకే గాజు గ్లాసు గుర్తు.. ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
Glass Tumbler Symbol To Janasena
Follow us

|

Updated on: Jan 24, 2024 | 8:45 PM

జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది కేంద్రం ఎన్నికల సంఘం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించింది. దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కేంద్ర ఎన్నికల కమిషన్.

గత పార్లమెంటు ఎన్నికల సమయంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేశారు జనసేన అభ్యర్థులు. అదే విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తుపైనే తమ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తారని జనసేన స్పష్టం చేసింది. ఈసీ ఉత్తర్వు కాపీలను జనసేన లీగల్ సెల్ ఛైర్మన్ సాంబశివ ప్రతాప్ బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేశారు. ఈసీ నిర్ణయంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఎక్స్ ద్వారా ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…