హింసాత్మక ఘటనలపై సీఎస్, డీజీపీని వివరణ కోరిన ఈసీ.. గవర్నర్‎కు వైసీపీ నేతల ఫిర్యాదు..

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. హింసాత్మక ఘటనపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ను ఆదేశించింది. దాడులపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారిని కలువనున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘర్షణలపై నివేదిక సమర్పించనున్నారు.

హింసాత్మక ఘటనలపై సీఎస్, డీజీపీని వివరణ కోరిన ఈసీ.. గవర్నర్‎కు వైసీపీ నేతల ఫిర్యాదు..
Election Commission

Updated on: May 16, 2024 | 11:34 AM

ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయింది. హింసాత్మక ఘటనపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ను ఆదేశించింది. దాడులపై వివరణ ఇచ్చేందుకు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారిని కలువనున్నారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘర్షణలపై నివేదిక సమర్పించనున్నారు. ఇప్పటికే సీఎస్, డీజీపీ ఢిల్లీకి బయలుదేరారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ డే నుంచే ఏపీ నివురుగప్పిన నిప్పులా తయారైంది. ముఖ్యంగా రాయలసీమ, పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అందులోనూ ఎస్పీలను మార్చిన ప్రాంతాల్లో మాత్రమే పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరిగాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. పోలీసుల వైఫల్యం ఉందంటూ వైసీపీ, టీడీపీ ఫిర్యాదులు చేయడంతో అత్యంత సీరియస్‌గా తీసుకుంది. హింస జరిగే అవకాశం ఉందని తెలిసినా ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయారంటూ సీఎస్, డీజీపీకి సమన్లు ఇచ్చింది. దాంతో, ఎవరిపైనైనా ఈసీ వేటు వేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఏపీలో దాడులపై సీరియస్ అయింది కేంద్ర ఎన్నికల సంఘం. పల్నాడు, చంద్రగిరితో పాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీ సీఎస్ జవహర్ రెడ్డికి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఎన్నికల సంఘం సమన్లు పంపింది. ఏపీలో పోలింగ్ తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఈసీ ఆదేశించింది. దీంతో ఇవాళ వారిద్దరు ఢిల్లీకి బయలుదేరారు. మధ్యాహ్నం 3.30కు ఈసీఐకి వాస్తవ పరిస్థితులు వివరించనున్నారు. సీఎస్, డీజీపీ వివరణ తర్వాత ఈసీ యాక్షన్‌‎పై ఉత్కంఠ నెలకొంది. ఎవరిపై ఈసీ వేటు వేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‎ను కలవనున్నారు వైసీపీ నేతలు. పోలింగ్ తర్వాత జరిగిన హింసపై ఫిర్యాదు చేయనున్నారు. కేవలం పోలింగ్‎కు ముందు జిల్లా ఎస్పీలను మార్పు చేసిన ప్రాంతాల్లో మాత్రమే హింసాత్మక ఘటనలు జరిగాయని ఫిర్యాదులో పేర్కోనున్నట్లు సమాచారం. అల్లర్లు, దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఙప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. బాధ్యులపై కఠినమైన చర్యలకు ఆదేశించాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. రాజ్ భవన్‎లో గవర్నర్‎ను కలిసేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైసీపీ బృందం వెళ్లనుంది. ఒకవైపు ఈసీ, డీజీపీని కేంద్ర ఎన్నికల కమిషన్ పిలిపించుకుని వివరణ కోరిన నేపథ్యంలో, రాష్ట్రంలో వైసీపీ నేతలు గవర్నర్ ను కలవడంపై ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..