Duvvada Family Controversy: చర్చలు కొలిక్కివచ్చేనా..! 3 డిమాండ్లకు ఓకే చెప్పిన దువ్వాడ.. కానీ.. రెండిటికి నో..
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ రగడ కంటిన్యూ అవుతోంది. రెండో రోజు జరిపిన చర్చల్లోను వివాదానికి ఫుల్ స్టాప్ పడలేదు. మూడు డిమాండ్లకు ఓకే చెప్పిన దువ్వాడ.. రెండింటిని నిరాకరించారు. ప్రజెంట్ ఎమ్మెల్సీ ఉంటున్న ఇంటి విషయంలో ఇద్దరు పట్టుబడుతున్నారు. ఎవరికి వారు తగ్గేదేలేంటున్నారు.
దువ్వాడ ఫ్యామిలీ రగడ ఇప్పటికిప్పుడు సర్ధుమణిగేలా లేదు. రెండో రోజు జరిపిన చర్చలు సైతం కొలిక్కిరాలేదు. దువ్వాడ వాణి వైపు నుంచి పెట్టిన 5డిమాండ్స్ లో మూడింటికి ఓకే చెప్పిన దువ్వాడ శ్రీనివాస్.. రెండు డిమాండ్లను తిరష్కరించారు. ఐదు డిమాండ్లలో 1.పర్లాకిమిడి లోని ఫ్యాక్టరీ, 2. టెక్కలి వెంకటేశ్వర కాలనీలోని నివాసాన్ని పిల్లలకు రిజిస్టర్ చేసేందుకు అంగీకరించారు. అలాగే 3వ డిమాండ్ చిన్న కుమార్తె పీజీ మెడికల్ ఎడ్యుకేషన్, వివాహం ఖర్చు భరించేందుకు ఓకే అన్నారు. MLC దువ్వాడ శ్రీనివాస్ ప్రజెంట్ నివాసముంటున్న ఇళ్లు పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేయాలన్న 4వ డిమాండ్ ను అయితే ఆయన నిరాకరించారు. విడాకులు ఇవ్వకూడదన్న 5వ డిమాండ్‌ను సైతం తిరష్కరించారు. ఇంత రచ్చ జరిగాక ఇద్దరు వేరువేరుగా ఉండటమే మేలన్నారు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్. ఇంట్లోకి పిల్లలకు ఎంట్రీ విషయంలో ఇప్పటికిప్పుడైతే కుదరదని చెప్పారు.
దువ్వాడ బ్రదర్స్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలన్నారు దువ్వాడ వాణి. ఇంతకుముందు ఏవైతే తమకు ఇచ్చేసామని చెప్పారో అవే ఇస్తామనడంలో కొత్తగా ఏముందని ప్రశ్నించారు. రూ.40 లక్షల GST, రూ.33 లక్షల లోన్ కట్టాలన్నారు. అలాగే తమ బంగారం పద్దులు విడిపించాలి.. చాలా అప్పులు ఉన్నాయి అవన్నీ కట్టాలన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి సర్వం ఇచ్చేశాం అనడంలో ఒక్కదానికి పొంతన లేదన్నారు. తమ స్టాండ్ తమకు ఉంది.. దాని విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్నారు దువ్వాడ వాణి. ఇదే న్యూసెన్స్ కంటిన్యూ అయితే తాము ఏ స్థాయికైనా వెళ్తామన్నారు వాణి.
ప్రజెంట్ అటు దువ్వాడ శ్రీనివాస్.. ఇటు దువ్వాడ వాణి వర్సెన్ ఇదీ. ఇప్పటికే 6రోజులుగా నిరసన చేస్తున్న దువ్వాడ వాణి.. తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే నిరసన కంటిన్యూ చేస్తామంటున్నారు. అయితే ఇవాళ మరోసారి చర్చలు ఏమైనా జరుగుతాయా?. ఇంకేమైనా ఫురోగతి ఉంటుందేమో చూడాలి మరి.
ఇదిలాఉంటే.. దివ్వెల మాధురి ప్రస్తుతం.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. దువ్వాడ ఇంటికి వస్తుండగా.. కారు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే.. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు..