కళాశాల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ బిజినెస్.. ఆన్‌లైన్‌ కేంద్రంగా అమ్మకాలు..

కళాశాల విద్యార్థులే లక్ష్యంగా కొంతమంది దుండగులు ఆన్‌లైన్‌లో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు. దీంతో చాలామంది అమాయకులు డ్రగ్స్‌కి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

కళాశాల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ బిజినెస్.. ఆన్‌లైన్‌ కేంద్రంగా అమ్మకాలు..
Follow us
uppula Raju

|

Updated on: Nov 23, 2020 | 12:05 PM

కళాశాల విద్యార్థులే లక్ష్యంగా కొంతమంది దుండగులు ఆన్‌లైన్‌లో డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నారు. దీంతో చాలామంది అమాయకులు డ్రగ్స్‌కి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. విశాఖ పోలీసులు చేపట్టిన ప్రత్యే క ఆపరేషన్‌లో ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేసి వారి దగ్గరి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అరవింద్ అనే యువకుడు ఇటీవల బెంగుళూరులో డిగ్రీ పూర్తిచేశాడు. ఆన్‌లైన్‌లో తన స్నేహితుడు పంపించిన లింక్ ద్వారా ఒక్కో ఎల్ఏడీ బ్లాట్‌ని (లిసర్జిక్‌ యాసిడ్‌ డై ఇథైల్‌మైడ్‌) రూ. 400 కు కొనుగోలు చేశాడు. తిరిగి వాటిని మరో నలుగురు స్నేహితులకు రూ.1000కి విక్రయిస్తున్నాడు. ఇలా ఒక్కో ఎల్ఏడీ బ్లాట్‌ని రూ.2 వేల చొప్పున కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. అరవింద్ మాదిరే మరో నలుగురు వ్యక్తులు విద్యార్థులకు డ్రగ్స్ విక్రయిస్తున్నారు. దీంతో సాంకేతిక, గాయత్రి కళాశాలల దగ్గర పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులు కనపర్తి సాహిల్, పిల్లా చంద్రశేఖర్, మైఖేల్ వెల్కమ్, మసబత్తుల మురళీధర్‌గా గుర్తించారు. మరో నిందితుడు యతిరాజ్యం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఇతడిపై ఇది వరకే డ్రగ్స్ కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఎల్ఏడీని చాలా రకాల పేర్లతో డ్రగ్స్ వ్యాపారులు విక్రయిస్తారు. యాసిడ్, బ్లాటర్, డోసెస్, డాట్స్, ట్రిప్స్, మెల్లో తదితర పేర్లతో విక్రయిస్తారు. దీనిని ముక్కు ద్వారా పీల్చడం, ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు. అమెరికాలో వీటిని పూర్తిగా నిషేధించారు.