AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపిన ఇన్స్‌పెక్టర్.. చివరికి ట్విస్ట్ ఇదే..!

పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసుల నుంచి తొలగిస్తూ.. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ డిస్మిస్ చేశారు. డీఐజీ ఆదేశాలతో క్రమశిక్షణ చర్యలలో భాగంగా శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వు్లు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్‌లో ఉన్నారు.

ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపిన ఇన్స్‌పెక్టర్.. చివరికి ట్విస్ట్ ఇదే..!
Cm Chandrababu Naidu, Ci Shankaraiah
Balaraju Goud
|

Updated on: Nov 22, 2025 | 7:53 AM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడకు నోటీసులు పంపిన మాజీ సీఐపై సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా చర్య కింద సర్వీసు నుంచి తొలగిస్తూ కీలక ఉత్వర్వులు జారీ చేశారు పోలీస్‌ ఉన్నతాధికారులు.

పులివెందుల మాజీ సీఐ శంకరయ్యను సర్వీసుల నుంచి తొలగిస్తూ.. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ డిస్మిస్ చేశారు. డీఐజీ ఆదేశాలతో క్రమశిక్షణ చర్యలలో భాగంగా శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వు్లు జారీ చేశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శంకరయ్య వీఆర్‌లో ఉన్నారు.

అసెంబ్లీలో వైఎస్ వివేకా హత్య కేసు విషయాన్ని వివరిస్తూ.. సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి సీఐ శంకరయ్య పేరును ప్రస్తావించారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు సీఐ శంకరయ్య సమక్షంలోనే ఆధారాలను చెరిపివేశారని ఆరోపించారు చంద్రబాబు. ఘటనా స్థలంలోని శంకరయ్య ఉన్నా అడ్డుకోలేదని చంద్రబాబు బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆరోపణలను తోసిపుచ్చిన శంకరయ్య.. చంద్రబాబు తన తన పరువుకు, ప్రతిష్టకు భంగం కలిగించాయని సీఐ శంకరయ్య సెప్టెంబర్‌ 18న సీఎం చంద్రబాబు నాయుడుకు లీగల్‌ నోటీసులు పంపించారు.

అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు తనకు క్షమాపణ చెప్పాలని, రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్ నోటీసుల్లో డిమాండ్ చేశారు. 29 ఏళ్లుగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో నిజాయితీగా పనిచేస్తున్నానని.. 15 రోజుల్లో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే శంకరయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు పోలీసు ఉన్నతాధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

పుష్ప2 రికార్డు బ్రేక్ చేసిన బాలీవుడ్ యాక్షన్ సినిమా!
పుష్ప2 రికార్డు బ్రేక్ చేసిన బాలీవుడ్ యాక్షన్ సినిమా!
మరో వారంలో NTPC రైల్వే రాత పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ లింక్
మరో వారంలో NTPC రైల్వే రాత పరీక్షలు.. ఉచిత మాక్‌ టెస్ట్‌ లింక్
ట్రంప్‌ బాటలో మరో దేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
ట్రంప్‌ బాటలో మరో దేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం!
నెపోటిజంపై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్లు!
నెపోటిజంపై స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్లు!
కుప్పకూలిన అహోబిలం ఆలయం.. భారతీయుడి సహా, మరో ముగ్గురు మృతి!
కుప్పకూలిన అహోబిలం ఆలయం.. భారతీయుడి సహా, మరో ముగ్గురు మృతి!
మసక మసక చీకటిలో.. కొత్త వెర్షన్ విన్నారా..?
మసక మసక చీకటిలో.. కొత్త వెర్షన్ విన్నారా..?
చేతిలో డబ్బు నిలవడంలేదా.. సంపదను అడ్డుకునే మీ ఇంట్లోని వాస్తు..
చేతిలో డబ్బు నిలవడంలేదా.. సంపదను అడ్డుకునే మీ ఇంట్లోని వాస్తు..
చానెల్‌ షో ప్రారంభించిన తొలి ఇండియన్‌ మోడల్‌ భవిత.. వీడియో వైరల్
చానెల్‌ షో ప్రారంభించిన తొలి ఇండియన్‌ మోడల్‌ భవిత.. వీడియో వైరల్
ఏం జరిగినా సిక్సర్లు కొట్టడం ఆపొద్దు.. కెప్టెన్ స్ట్రిక్ ఆర్డర్
ఏం జరిగినా సిక్సర్లు కొట్టడం ఆపొద్దు.. కెప్టెన్ స్ట్రిక్ ఆర్డర్
సబ్బు మంచి సువాసన వస్తుందని తెగ పీల్చుతున్నారా.. వామ్మో జాగ్రత్త
సబ్బు మంచి సువాసన వస్తుందని తెగ పీల్చుతున్నారా.. వామ్మో జాగ్రత్త