AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Floods: మీ వాహనాలు.. వరదల్లో మునిగాయా..? ఈ సూచనలు పాటించండి

తెలుగు రాష్ట్రాల్లో వరదల విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. చాలా ప్రాంతాల్లో నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యప్తమైంది. వదరల్లో చాలామంది కొట్టుకుపోయారు. ఇక చాలా వాహనాలు వరద ధాటికి మునిగిపోవడం, కొట్టుకుపోవడం వంటివి జరిగాయి.

Floods: మీ వాహనాలు.. వరదల్లో మునిగాయా..?  ఈ సూచనలు పాటించండి
Andhra Floods
Ram Naramaneni
|

Updated on: Sep 04, 2024 | 6:15 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో వరదలతో.. వందల కార్లు, వేల బైక్‌లు, ఆటోలు, ఇతర వాహనాలు.. మూడు నాలుగు రోజులుగా ముంపులోనే ఉండిపోయాయి. వరద తగ్గాక అవన్నీ ఇప్పుడు బురదలో దర్శనమిస్తున్నాయి. కలర్‌ పోయి, డోర్లు, టైర్లు డ్యామేజ్ అయి కనిపిస్తున్నాయి. బురదలో కూరుకుపోయిన వాహనాలు పనికొస్తాయా అన్న సందేహం ఓ వైపు అయితే.. రిపేర్లకి అయ్యే ఖర్చు తడిసి మోపెడు కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు మా వాహనాలు ఎక్కడ? అని వెతుక్కునే పనిలోపడ్డారు చాలామంది. ఎక్కడ వాహనం పార్క్ చేశారో.. వరద ఎటువైపు వెళ్లిందో.. ఆ పరిసర ప్రాంతాల్లో సెర్చ్ చేస్తున్నారు.

బుడమేరు దెబ్బకి విజయవాడలో లక్షకు పైగా బైక్‌లు.. 30వేల కార్లు.. 5 వేల వరకు ఆటోలు నీట మునిగాయని అంచనా. అవేవీ పనిచేసే పరిస్థితి లేదు. వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వాహనాల రూపు రేఖలు మారిపోయాయి. చాలా వాహనాలకు ఇంజిన్ దెబ్బతింది.  బురద చేరి గేర్ బాక్స్‌ బిగుసుకుపోయింది.  స్పీడో మీటర్‌, ఇండికేటర్‌, సీట్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. కార్పెట్ సహా ఇంటీరియర్ వర్క్స్‌ పూర్తిగా పాడయ్యాయి

వరదలో కొట్టుకుపోయి.. నీళ్లలో నానిన వాహనాలు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. అలాంటి వాహనాలను చాలా జాగ్రత్తగా మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లాలి. లేదంటే అంతే సంగతులు. వరదల్లో వాహనాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  •  రోజుల తరబడి వరదలో వాహనాలు ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టార్ట్‌ చేసే ప్రయత్నం చేయకూడదు
  •  డైరెక్ట్‌గా మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్లాలి
  •  పెట్రోల్‌, ఇంజిన్ ఆయిల్ తీసేసి ట్యాంక్ క్లీన్‌ చేయాలి
  • పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ మార్చితే పనిచేయొచ్చు
  • ముందే స్టార్ట్ చేస్తే పనిచేయడం పక్కనపెడితే… బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం ఉంది

వందల వేల వాహనాలు డ్యామేజ్ అయ్యాయి సరే. కానీ చాలా వాహనాలు వరదలో గల్లంతయ్యాయి. ఇప్పుడు వాటిని ట్రేస్‌ చేసే పనిలో పడ్డారు వాహన యజమానులు. మా బండి జాడ తెలిస్తే చెప్పండని కాలనీలన్నీ జల్లెడ పడుతున్న పరిస్థితి.

కార్లు, బైక్‌లు, ఆటోలు.. చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇప్పుడవన్నీ మెకానిక్ షాప్‌లకు పోటెత్తనున్నాయి. రిపేర్లకి ఎంత టైమ్ పడుతుంది..? ఎంత ఖర్చువుతుందోనన్న ఆందోళన వాహనదారుల్ని కంగారెత్తిస్తోంది.

బైక్లు, కార్లు, ఆటోలు, ఇలా వాహనాలన్నింటినీ శుభ్రం చేసే బాధ్యత కూడా తామే తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. వాటికి రిపేర్లు కూడా చేయించే బాధ్యత తమదేనన్నారు. ఆయా వాహనాల ఇన్సూరెన్సు క్లెయిమ్స్ సైతం 15 రోజుల్లో సెటిల్ అయ్యేలా బ్యాంకర్లు, ఇన్సూరెన్సు్ కంపెనీలతో మాట్లాడతామని చంద్రబాబు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..