Vijayawada: లక్ష కిలోల పెరుగు.. లక్షల లీటర్ల పాలు.. వరద పాలు.! విజయవాడ అతలాకుతలం.

Vijayawada: లక్ష కిలోల పెరుగు.. లక్షల లీటర్ల పాలు.. వరద పాలు.! విజయవాడ అతలాకుతలం.

Anil kumar poka

|

Updated on: Sep 05, 2024 | 7:47 AM

భారీ వర్షాలతో బెజవాడ గజగజలాడుతోంది. 50ఏళ్లలో ఎప్పుడూ రానంత వరద బీభత్సం సృష్టిస్తోంది. బుడమేరు పరిసర గ్రామాలన్నీ జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి.. మంత్రులు, అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. వరద పరిస్థితిని ఎప్పటిప్పుడు ఆరా తీస్తూ.. సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు.

విజయవాడ చిట్టినగర్‌లో ఉన్న విజయ డెయిరీ యూనిట్‌ను వరద ముంచెత్తింది. వాన నీటికి తోడు, బుడమేరు ఉద్ధృతి కారణంగా కర్మాగారంలోకి భారీగా నీరు చేరింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అనూహ్యంగా వరద పెరగడంతో యూనిట్‌ లోపలకు నడుం లోతుకు పైగా నీరు చేరింది. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది, కార్మికులు లోపలే చిక్కుకున్నారు. దిగుమతి కోసం వెళ్లిన పాల ట్యాంకర్లు, పాల ప్యాకెట్లు, ఇతర ఉత్పత్తులను వివిధ ప్రాంతాలకు తరలించే వ్యాన్లు సైతం ముంపులో ఇరుక్కుపోయాయి. దీంతో హుటాహుటిన కార్యకలాపాలు నిలిపివేసి, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం, వరద నీరు ముంచెత్తడంతో జనరేటర్లు, ఇతర యంత్రాలు మొరాయించాయి. ఈ సమయంలో ఫ్యాక్టరీ లోపల లక్షల లీటర్ల పాల ప్యాకెట్లు, లక్ష కిలోల పెరుగు సహా సుమారు రూ.65 కోట్లు విలువ చేసే ఉత్పత్తులు నీటమునిగాయి. దీంతో ఆదివారం ఉదయం విజయవాడ నగరంతో పాటు, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పాల ప్యాకెట్ల కొరత ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన స్పందించిన ఫ్యాక్టరీ వర్గాలు, ఆదివారం ఉదయం సేకరించిన పాలను వీరవల్లిలో ఇటీవల నిర్మించిన కొత్త యూనిట్‌కు తరలించి పంపిణీదారులు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. కానీ వర్షంతో జరిగిన నష్ట ప్రభావం కొన్ని వారాలు ఉంటుందని సమాచారం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.