అప్పుడే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం.. అరగంటలో మాల్ మొత్తం లూటీ
ఏదైనా షాపింగ్ మాల్‌లో పండగ సందర్భంగానో, మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తుంటారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తారు. అలా పాకిస్థాన్‌లో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తూ భారీ డిస్కౌంట్ ప్రకటించింది మాల్ యాజమాన్యం. షాపు ఓపెనింగ్ గ్రాండ్‌గా చేశారు. కస్టమర్స్ కూడా వేలల్లో పోటెత్తారు. కానీ కొనేందుకు కాదు.. అరగంటలో మొత్తం మాల్‌లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్లిపోయారు.
ఏదైనా షాపింగ్ మాల్‌లో పండగ సందర్భంగానో, మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తుంటారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తారు. అలా పాకిస్థాన్‌లో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తూ భారీ డిస్కౌంట్ ప్రకటించింది మాల్ యాజమాన్యం. షాపు ఓపెనింగ్ గ్రాండ్‌గా చేశారు. కస్టమర్స్ కూడా వేలల్లో పోటెత్తారు. కానీ కొనేందుకు కాదు.. అరగంటలో మొత్తం మాల్‌లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్‌లోని కరాచీలో కొత్తగా ప్రారంభించిన షాపింగ్ మాల్ ‘డ్రీమ్ బజార్’… ప్రారంభోత్సవం రోజునే లూటీకి గురయ్యింది. ఈ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం రూ. 50 కంటే తక్కువ ధరలకే వివిధ వస్తువులను విక్రయిస్తామంటూ ఈ మాల్‌ను ప్రారంభించారు. మొదటి రోజునే మాల్ విధ్వంసానికి గురయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిల్లలను ఎస్‌ఐలను చేయడానికి.. పేపర్ లీక్ చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు
ఓవర్‌టైమ్ చేసి గుండె వ్యాధుల బారిన పడుతున్న ఉద్యోగులు