10కి పైగా డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై రష్యా దాడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా పదికి పైగా డ్రోన్స్, క్రూయజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం తెల్లవారుజామున కీవ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. కీవ్ లోకి అత్యవసర సేవలను అందిస్తున్నట్టు కీవ్ మేయర్ తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా పదికి పైగా డ్రోన్స్, క్రూయజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. సోమవారం తెల్లవారుజామున కీవ్‌లో వరుస పేలుళ్లు సంభవించాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. కీవ్ లోకి అత్యవసర సేవలను అందిస్తున్నట్టు కీవ్ మేయర్ తెలిపారు. షెవ్చెంకివ్స్కీ జిల్లాలో శిథిలాలు పడటం వల్ల ఒకరు గాయపడ్డారు. మరోవైపు, ప్రతిదాడికీ తిరిగి సమాధానం ఉంటుందని, శత్రువు తప్పకుండా దాన్ని స్వీకరించాల్సి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ తన టెలిగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 10కి పైగా క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్స్‌తో రష్యా దాడులకు పాల్పడిందని కీవ్ నగర సైనిక పరిపాలనా అధిపతి సెర్హా పాప్కో తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో కూడా పేలుడు సంభవించిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఖార్కివ్ ప్రాంత అధిపతి ఒలేహ్ సినీహుబోవ్ ధ్రువీకరించారు. ఖార్కివ్‌లోని ఇండస్ట్రియల్ని జిల్లాపై సోమవారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడి వల్ల ఒక నివాస భవనం, అనేక ఇతర నివాస సముదాయాలకు నిప్పంటుకుందని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

