ఓవర్‌టైమ్ చేసి గుండె వ్యాధుల బారిన పడుతున్న ఉద్యోగులు

జపాన్‌ పౌరులకి వర్కాహాలిక్స్‌గా పేరుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణు బాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలను నేలమట్టం చేసినా, పట్టుదలతో ముందడుగు వేసి అభివృద్ధి చెందిన దేశంగా జపాన్‌ను నిలిపారు. ఎంతో క్రమశిక్షణగా ఉంటూ, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే పని విషయంలో పడి వారు వ్యక్తిగత జీవితాన్ని కూడా పట్టించుకోవడంలేదు.

ఓవర్‌టైమ్ చేసి గుండె వ్యాధుల బారిన పడుతున్న ఉద్యోగులు

|

Updated on: Sep 04, 2024 | 7:32 PM

జపాన్‌ పౌరులకి వర్కాహాలిక్స్‌గా పేరుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణు బాంబులు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలను నేలమట్టం చేసినా, పట్టుదలతో ముందడుగు వేసి అభివృద్ధి చెందిన దేశంగా జపాన్‌ను నిలిపారు. ఎంతో క్రమశిక్షణగా ఉంటూ, దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే పని విషయంలో పడి వారు వ్యక్తిగత జీవితాన్ని కూడా పట్టించుకోవడంలేదు. ఆఖరికి సంసార జీవితంపైనా దృష్టి పెట్టడంలేదని పలు సర్వేలు తెలుపుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలెర్టయింది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని ఆర్డరేసింది. పని దినాల విషయంలో జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయాలని సూచించింది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్‌ నిర్ణయం తీసుకుని.. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్‌ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10కి పైగా డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌​పై రష్యా దాడి

Ganesh Chaturthi: వినాయకుడి తొండం ఆ వైపు ఉంటే అదృష్టం

Follow us