Andhra Pradesh: హైకమాండ్‌దే తుది నిర్ణయం.. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నాం.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు..
టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనా.. ఆ కూటమిలో బీజేపీ చేరుతుందా? లేదా ? అనే ఉత్కంఠకు మాత్రం తెరపడటం లేదు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ జనసేనతో తమ పొత్తు ఇప్పటికీ కొనసాగుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఇటీవల పురంధేశ్వరితో సమావేశమై పొత్తుల అంశంపైనే చర్చించారని తెలుస్తోంది.
ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంపై ఫోకస్ చేస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం పొత్తుల విషయంలోనే ఇంకా కసరత్తు కొనసాగిస్తోంది. జనసేనతో పొత్తులో ఉన్నామంటున్న కమలం నేతలు.. టీడీపీతో పొత్తుపై తర్జనభర్జన పడుతున్నారు. దీంతో ఆపార్టీలో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఖాయమైనా.. ఆ కూటమిలో బీజేపీ చేరుతుందా? లేదా ? అనే ఉత్కంఠకు మాత్రం తెరపడటం లేదు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ జనసేనతో తమ పొత్తు ఇప్పటికీ కొనసాగుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఇటీవల పురంధేశ్వరితో సమావేశమై పొత్తుల అంశంపైనే చర్చించారని తెలుస్తోంది.
తాజాగా, ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. జనసేనతో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందన్న పురంధేశ్వరి.. ఈ అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దీనిపై తమ జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎన్నికలకు నెల రోజుల ముందు పొత్తులపై బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులో ఉన్నామన్నారు. పొత్తుల విషయంలో హైకమాండ్‌దే తుది నిర్ణయమన్నారు పురంధేశ్వరి.
వీడియో చూడండి..
మరోవైపు టీడీపీ నేత మాగంటి బాబు- పురంధేశ్వరి సమావేశం చర్చనీయాంశంగా మారింది.చర్చలు ఊహాగానాలు ఎలా వున్నా పొత్తులపై హైకమాండ్ దే తుడి నిర్ణయమని స్పష్టం చేశారు పురంధేశ్వరి. సంక్రాంతి తరువాత తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమవుతుండటంతో.. టీడీపీ, జనసేన కూటమిలో కమలం పార్టీ చేరుతుందా ? లేదా ? అన్నది విషయంలో త్వరలోనే స్పష్టత రావొచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..