Weather Report Updates: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం.. ఏపీలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు

Subhash Goud

Subhash Goud |

Updated on: Dec 23, 2022 | 1:45 PM

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. నైరుతి, ప్రక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర అల్ప పీడన..

Weather Report Updates: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం.. ఏపీలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
Cyclone Updates

ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. నైరుతి, ప్రక్కనే ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర అల్ప పీడన ప్రాంతం ఉత్తర వాయువ్య దిశగా కదిలి, గురువారం ఉదయం వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. అయితే నైరుతికి ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతానికి సమీపంలో శ్రీలంకకి తూర్పు ఈశాన్యంగా 480 కిమీ దూరంలో, నాగపట్టణం (తమిళనాడు) కి దక్షిణ ఆగ్నేయ దిశగా 540 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది తదుపరి 484 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఆ తర్వాత పశ్చిమ నైరుతి దిశగా వంపు తిరిగి శ్రీలంక మీదుగా కొమోరిన్ ప్రాంతం వైపు వెళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని కారణంగా ఏపీలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో శుక్ర, శని,ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు, రేపు పొడి వాతావరణ ఉంటుందని, ఎల్లుండి తెలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిఆ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu