AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Montha Live Updates: వేలల్లో పంట నష్టం.. 1700 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్లు.. చంద్రబాబు ఏరియల్ సర్వే

Andhra Pradesh Rains Live updates in Telugu: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్‌గా మారింది. గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్.. ప్రస్తుతం మచిలీపట్నంకి 70 కిలోమీటర్లు, కాకినాడకి 150 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో..

Cyclone Montha Live Updates: వేలల్లో పంట నష్టం.. 1700 కి.మీ మేర దెబ్బతిన్న రోడ్లు.. చంద్రబాబు ఏరియల్ సర్వే
Srilakshmi C
| Edited By: Anand T|

Updated on: Oct 29, 2025 | 9:44 PM

Share

అమరావతి, అక్టోబర్ 29: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్‌గా మారింది. గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్.. ప్రస్తుతం మచిలీపట్నంకి 70 కిలోమీటర్లు, కాకినాడకి 150 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం చూపనుంది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యల్లో అధికారులకు సహకరించాలంటూ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు. గడిచిన 6 గంటల్లో 15 కి.మీ వేగంతో కదులుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తర వాయవ్యంగా కదిలి.. ఈ రోజు రాత్రి లోపు కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

అయితే మొంథా తుఫాన్‌ తీరం దాటినా వాన గండం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇవాళ, రేపు తీరం వెంట ఈదురుగాలులు ప్రభావం వుంటుంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. తిరుపతి జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ.

మరిన్ని తాజా అప్‌డేట్స్‌ ఇక్కడ తెలుసుకోండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Oct 2025 09:10 PM (IST)

    తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలో పొంగుతున్న వాగులు

    మొంథా తుఫాన్‌ ప్రభావంతో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలు

    భారీ వర్షాల కారణంగా పెరిగిన మున్నేరు వాగు నీటిమట్టం

    ఖమ్మం జిల 19 అడుగులకు చేరిన మున్నేరు వరద ప్రవాహం

    ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలతో మున్నేరుకు భారీగా వరద

    ఎగువనకురిసిన భారీ వర్షాలతో అంతకంతకూ పెరుగుతున్న మున్నేరు వరద ప్రవాహం

  • 29 Oct 2025 08:54 PM (IST)

    దిండి ప్రాజెక్టు సమీపంలో తెగిన జాతీయ రహదారి.. వాహనాల దారి మళ్లింపు

    శ్రీశైలం-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రమాదం

    దిండి ప్రాజెక్టు సమీపంలో కోతకు గురైన జాతీయ రహదారి

    హాజీపూర్‌, చింతపల్లి మీదుగా వాహనాల దారి మళ్లింపు

    కోతకు గురైన జాతీయ రహదారిని పరిశీలించిన నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ

  • 29 Oct 2025 08:10 PM (IST)

    విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలో గురువారం కూడా భారీ వర్షాలు

    ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంకా అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

    ఇంకా ప్రొహిబిటెడ్ జోన్ లోనే ఆర్కే బీచ్ తీర ప్రాంతం

    ఆర్కే బీచ్ రోడ్ లో తీరం వైపు సందర్శకులు వెళ్లకుండా పోలీసుల పహారా

    అల్లూరి జిల్లాలో కొండపోత వర్షం ఈదురు గాలులు

    ఘాట్ రోడ్ లో భారీగా నేలకొరిగిన చెట్లు, జారిపడిన బండ రాళ్లు

    యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధారణ చర్యలు

    స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్

    ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

    రేపు కూడా అల్లూరి జిల్లాకు భారీ వర్ష సూచన

    అనకాపల్లి జిల్లాలో నిండుకుండలా మారిన జలాశయాలు

    రైవాడ, తాండవ జలాశయాల నుంచి దిగువకు నీరు విడుదల

    నీట మునిగిన పంట పొలాలు

  • 29 Oct 2025 07:56 PM (IST)

    విశాఖలో తుఫాను నష్టం అంచనా

    తుఫానుకు ప్రభావితమైన 21 గ్రామాలు

    107.7 హెక్టార్లలో వరి పంట నష్టం

    ప్రభావితమైన 383 మంది రైతులు

    రెండు ఇల్లు పూర్తిగా.. 20 ఇల్లు పాక్షికంగా ధ్వంసం

    నేలకొరిగిన 157 చెట్లు.. పది విద్యుత్ స్తంభాలు నేలమట్టం

    కూలిపోయిన 8 గోడలు

  • 29 Oct 2025 07:40 PM (IST)

    వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్స్‌ ఏర్పాటు

    భారీవర్షాల దృష్ట్యా వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ప్రజలకు అత్యవసర సహాయం కొరకు కంట్రోల్ రూమ్,టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు

    వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టరేట్ 1800 425 3424, 9154225936, 1800 425 1115

    గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 1800 425 1980, 9701999676 ,

    విద్యుత్ కు సమస్యల కోసం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 1800 425 0028 ఏర్పాటు

  • 29 Oct 2025 07:30 PM (IST)

    తుఫాన్ ఎఫెక్ట్.. వరంగల్‌ జిల్లాలో రికార్డ్ స్థాయిలో వర్షపాతం

    రికార్డు స్థాయిలో కల్లెడలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

    రెడ్లవాడలో 30 సెంటీమీటర్లు

    కాపులకనపర్తి లో 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు

  • 29 Oct 2025 07:18 PM (IST)

    తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్

    బుధవారం రాత్రి సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం

    6 జిల్లాలకు రెడ్ అలెర్ట్..

    సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.

    9 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..

    నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమరం భీమ్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం..

    రెడ్, ఆరెంజ్ అలర్ట్ జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

    ఎల్లో అలెర్ట్ జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం

  • 29 Oct 2025 07:03 PM (IST)

    తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

    తెలంగాణపై కొనసాగుతున్న మొంథా తఫాన్ ప్రభావం

    నిన్నటి నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

    వర్షాల కారణంగా వరంగల్, హనుమకొండ, ములుగు మహబూబాబాద్ జిల్లాల్లో గురువారం స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించిన అధికారులు

  • 29 Oct 2025 05:53 PM (IST)

    హైదరాబాద్‌పై మొంథా తుఫాన్ ఎఫెక్ట్

    గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

    ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో పలుకాలనీలు జమయం

    పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోల్స్‌ చెరువుల్ని తలపిస్తున్న రోడ్లు

    రహదారులపై వరద నీటితో వాహనదారుల ఇబ్బందులు

    ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై GHMC, SDRF, హైడ్రా, ఫైర్‌ సిబ్బంది స్పందించాలన్న సీఎం

    త్వరగా లాగౌట్ అయి ఇళ్లకు వెళ్లాలని ఉద్యోగులకు హైదరాబాద్‌ పోలీసుల సూచన

  • 29 Oct 2025 05:47 PM (IST)

    తుఫాన్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రి నారా లోకేష్‌ టెలీకాన్ఫరెన్స్‌

    వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగింపు చర్యలు చేపట్టాలన్న మంత్రి

    గృహాలు, వాణిజ్య సముదాయాలకు వంద శాతం విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశం

    పంటనష్టంపై అంచనాలను రూపొందించాలని అధికారులకు మంత్రి ఆదేశం

    తుఫాన్‌ ప్రభావంతో జరిగిన ప్రాణనష్టం, దెబ్బతిన్న నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలన్న మంత్రి

  • 29 Oct 2025 05:04 PM (IST)

    వాగులో కొట్టుకుపోయిన రైల్వే సిబ్బంది.. కాపాడిన పోలీసులు

    ఏపీలో భారీగా కురుస్తున్న వర్షాలు

    నీలాయపాలెం, ఉప్పుగుండూరు రోడ్డుపై వరదనీటిలో కొట్టుకుపోయిన రైల్వే సిబ్బంది

    బైకుతో కొట్టుకుపోయిన రైల్వే సిబ్బందిని కాపాడిన పోలీసులు

  • 29 Oct 2025 04:50 PM (IST)

    విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

    తుఫాన్ ఎఫెక్ట్‌తో ఏపీలో భారీగా కురుస్తున్న వర్షాలు

    వర్షాల కారణంగా పలు జిల్లాలో కూలిన చెట్లు, విద్యుత్‌ స్థంభాలు

    విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

    సీఎండీలు, ఎస్‌ఈలు, స్పెషల్‌ ఆఫీసర్లతో రివ్యూ..

    త్వరగా ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా జరగాలన్న మంత్రి

    90 శాతంపైగా పునరుద్ధరణ పనులు పూర్తి చేశామన్న అధికారులు

    వందశాతం విద్యుత్‌ సరఫరా దిశగా పని చేయాలని మంత్రి ఆదేశం

  • 29 Oct 2025 04:49 PM (IST)

    ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు

    మొంథా తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు

    వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు, చెరువులు

    లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావారణ శాఖ హెచ్చరిక

    ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచన

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

  • 29 Oct 2025 04:35 PM (IST)

    మొంథా తుఫాన్‌పై మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్

    మహబూబాబాద్‌, ములుగు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష

    అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ..

    అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశం

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క సూచన

    పశువులు, పంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

    రైళ్లు నిలిచిన చోట ప్రయాణికులకు..

    తక్షణ సాయం అందించాలని మంత్రి ఆదేశం

  • 29 Oct 2025 04:32 PM (IST)

    ఖమ్మం: మున్నేరు పరిసర ప్రాంతాల్లో వరద ప్రవాహం పరిశీలించిన కలెక్టర్

    మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో తెలంగాణలో భారీ వర్షాలు

    ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగుకు పెరిగిన వరద ప్రవాహం

    మున్నేరు వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్

    మున్నేరు పరిసర ప్రాంతాల్లో వరద ప్రవాహం పరిశీలించిన కలెక్టర్

    పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశం

    తుపాను దృష్ట్యా ఖమ్మం జిల్లాలో రెండ్రోజులు భారీ వర్ష సూచన

  • 29 Oct 2025 03:40 PM (IST)

    వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

    తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం

    ఇది పెనువిపత్తు రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్న సీఎం చంద్రబాబు

    గతంలో తుపానుల సమయంలో పనిచేసిన అనుభవం నాకుంది: సీఎం

    మొంథా తుపానుపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం: సీఎం

    ముందస్తు చర్యల కారణంగానే భారీ మొత్తంలో నష్టాన్ని నివారించగలిగాం: సీఎం చంద్రబాబు

  • 29 Oct 2025 03:32 PM (IST)

    తెలంగాణపై తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

    మొంథా తుపాన్ ప్ర‌భావంపై ముఖ్య‌మంత్రి ఆరా

    అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు ఆదేశం

    క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాల‌ని ఆదేశాలు

    వరి ధాన్యం తడవకుండ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశం

    ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం

    ఆస్తి, ప్రాణం, ధాన్య నష్టం జరగకుండా అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశం

  • 29 Oct 2025 03:29 PM (IST)

    వరదలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ 

    తెలంగాణపైనూ కొనసాగుతున్న తుఫాన్ ప్రభావం

    ఖమ్మం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు

    వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో ఉప్పొంగుతున్న వాగులు, వంకలు

    ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అంజనాపురం గ్రామ సమీపంలో నిమ్మ వాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్,

    డ్రైవర్ ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు

  • 29 Oct 2025 01:56 PM (IST)

    హుస్సేన్‌ సాగర్‌కు భారీ వరద నీరు

    రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్‌కు వరద పెరిగింది. సాగర్ FTLకు చేరువలో వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు. ప్రస్తుత నీటిమట్టం 513.40 మీటర్లు. ఇన్ ఫ్లో 2000 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 250 క్యూసెక్కులు వస్తోంది. అధికారులు హుస్సేన్‌ సాగర్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కవాడిగూడ, అశోక్ నగర్, గాంధీనగర్, సబర్మతి నగర్.. అరవింద్ నగర్ కాలనీలలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.  ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్‌ సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగాహైదరాబాద్‌ జంట జలాశయాలు నిండు కుండలా తలపిస్తున్నాయి.

  • 29 Oct 2025 01:31 PM (IST)

    నల్గొండలో తుఫాను బీభత్సం

    నల్గొండ జిల్లా కొమ్మేపల్లిలో వరద బీభత్సం సృష్టిస్తోంది. ST గురుకుల పాఠశాల చుట్టూ వర్షపు నీరు చేరింది. దీంతో అలాగే నాగర్‌కర్నూల్ జిల్లాలో తుఫాను ప్రభావం భారీగా ఉంది. ఇక్కడ ఓ కారు చిక్కుకోవడంతో అందులో ఉన్న వ్యక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి.

  • 29 Oct 2025 01:07 PM (IST)

    తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్‌ సర్వే

    తుఫాను కారణంగా నష్టాన్ని అంచనా వేసేందుకు సీఎం చంద్రబాబు అమరావతి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. బాపట్ల, పల్నాడు,కృష్ణా, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, కోడూరు.. నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు సీఎం ఏరియల్ విజిట్ చేయనున్నారు.

  • 29 Oct 2025 12:43 PM (IST)

    చంద్రబాబు ఏరియల్‌ సర్వే

    తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారు. అమరావతి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన ఏపీ సీఎం.. వాతావరణం అనుకూలిస్తే అమలాపురంలో దిగి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పంటనష్టం వేల ఎకరాల్లో ఉందని ఇప్పటికే ప్రాథమిక అంచనా వేశారు. ఉదయం CSతో చంద్రబాబు సమీక్ష నిర్వహించి వర్షాలకు దెబ్బతిన్న 1700 కిలోమీటర్ల రోడ్లను యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేయాలని సీఎం ఆదేశించారు.

  • 29 Oct 2025 12:22 PM (IST)

    విజయవాడలో మొంథా తుఫాను ప్రభావం

    — విజయవాడలో మొంథా తుఫాను ప్రభావం

    — ఈదురు గాలులకు పలుచోట్ల కూలిన చెట్లు

    — చిట్టినగర్ సొరంగం రోడ్డులో కూలిన 50ఏళ్ల చరిత్ర గల చెట్టు

    — పలు ద్విచక్ర వాహనాలు పాక్షికంగా ధ్వంసం

    — న్యూ రాజరాజేశ్వరి పేటలోనూ కూలిన చెట్లు

    — విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న నగరపాలక సంస్థ సిబ్బంది

    — భవానిపురంలో పలు రహదారులపై నిలిచిన వర్షం నీరు

    — వర్షపు నీటిని మోటార్ల ద్వారా తోడుతున్న మున్సిపల్ సిబ్బంది

    — కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో దుర్గగుడి ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత

    — తుఫానుతో.. సంచార రైతు బజార్లు ఏర్పాటు చేసి పలు సెంటర్లలో కూరగాయలు అమ్ముతున్న మార్కెటింగ్ శాఖ

  • 29 Oct 2025 11:26 AM (IST)

    తీరప్రాంతాలను తుఫాన్

    మొంథా తీవ్ర తుఫాన్​ ధాటికి ఏపీలోని విశాఖ నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాలను తుఫాన్ వణికిస్తుంది. కోనసీమ జిల్లాల్లో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకూలుతున్నాయి. తుఫాన్‌ ధాటికి గాలుల తీవ్రత పెరిగింది.

  • 29 Oct 2025 11:24 AM (IST)

    తీరం దాటింది‌

    మొంథా తీవ్ర తుఫాన్‌ నరసాపురం సమీపంలో తీరం దాటింది‌. సముద్రం అల్లకల్లోలంగా మారి తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి.

  • 29 Oct 2025 10:30 AM (IST)

    వేల ఎకరాల్లో పంట నష్టం

    – కోనసీమ జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం

    – ఈదురు గాలుల ప్రభావంతో నేలకొరికిన అరటి, వరి చేలు

    – మరికొన్ని చోట్ల వాణిజ్య పంటల్ని ముంచెత్తిన నీరు

    – క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

    – ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్న వ్యవశాయ మంత్రి

    – ఇవాళ సీఎం చంద్రబాబు అమలాపురం వెళ్లే అవకాశం

    – తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్ష

  • 29 Oct 2025 10:25 AM (IST)

    సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి

    ఈ మొంథా తుఫాను నేపథ్యంలో ఏపీ సర్కార్ సహాయక చర్యలపై దృష్టి సారిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పవన్‌ కలెక్టర్లకు సూచించారు. అలాగే వాతావరణం అనుకూలించినట్లయితే సీఎం చంద్రబాబు అమలాపురానికి వెళ్లనున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు.

  • 29 Oct 2025 10:18 AM (IST)

    బలహీనపడుతున్న తుఫాను

    మొంథా తుఫాన్‌ ఉత్తర వాయువ్య దిశగా కదులుతుంది. ప్రస్తుతం ఈ తుఫాన్‌ బలహీనపడింది. ఈ తీవ్ర వాయుగుండం మరికొన్ని గంటల్లో బలహీనపడనున్న తుఫాన్‌గా మారనుంది. ఈ మొంథా తుఫాన్‌ ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణిస్తూ బలహీనపడుతోంది.

  • 29 Oct 2025 09:33 AM (IST)

    మొంథా తుఫాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

    మొంథా తుఫాన్‌పై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చూడాలలని అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని పవన్‌ సూచించారు.

  • 29 Oct 2025 09:18 AM (IST)

    తుఫాను ఎఫెక్ట్

    1. కుదేలైన కోనసీమ

    • తుఫాన్‌ ఎఫెక్ట్‌తో పంటలు ధ్వంసం
    • వరి, అరటి రైతులకు భారీ నష్టం

    2. కృష్ణా జిల్లా దివిసీమపై తూఫాన్ ప్రభావం

    • నేలకొరిగిన అరటి తోటలు, కంద పంట
    • ప్రభుత్వమే ఆదుకోవాలని రైతుల ఆవేదన

    3. నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్ష బీభత్సం

    • శ్రీశైలం హైవేపైకి చేరిన వరద
    • లోతట్టు ప్రాంతాలు జలమయం

    4. విశాఖ అంతటా మొంథా బీభత్సం

    • సింహాచలం కొండపై భారీ వర్షం
    • మెట్ల మార్గంలో ప్రవహిస్తున్న వరద

    5. పల్నాడు జిల్లాలో భారీ వర్షాలు

    • KVపాలెంలో కుండపోత
    • పునరావాస కేంద్రానికి కూలీల తరలింపు

    6. పాడేరు ఏజెన్సీలో భారీ వర్షాలు

    • జారిపడ్డ బండరాళ్లు
    • దెబ్బతిన్న కిరండోల్‌ రైల్వే ట్రాక్‌
  • 29 Oct 2025 09:00 AM (IST)

    తెల్లపాడు వాగు వద్ద రాకపోకలకు అంతరాయం

    నెల్లూరు జిల్లా తెల్లపాడు వాగు వద్ద రహదారిపై వరద నీరు ప్రవాహిస్తోంది. తెల్లపాడు వాగు ఉద్ధృతికి ఏఎస్‌ పేట-ఆత్మకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోగోలు మండలంలో చెప్పలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రజల భద్రత కోసం బిట్రగుంట ఎస్సై ఇరువైపులా కంచె వేయించారు.

  • 29 Oct 2025 08:47 AM (IST)

    పెన్నా వారధి వద్ద తప్పిన ప్రమాదం

    నెల్లూరు జిల్లా సంగంలో పెన్నా వారధి వద్ద పెను ప్రమాదం తప్పింది. పెన్నా నది నుంచి ఇసుకను తరలించేందుకు మూడు పడవలు అందుబాటులో ఉంచారు. తుఫాను నేపథ్యంలో పక్కనే ఉన్న ఓ వంతెనకు వాటిని కట్టారు. భారీగా వరద నీరు రావడంతో ఆ పడవలకు ఉన్న తాళ్లు తెగిపోయి పెన్నానది గట్టున నిలిచాయి. అవి పెన్నా వారధి గేట్లకు తగలకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అవే తగిలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగిఉండేది.

  • 29 Oct 2025 08:45 AM (IST)

    కృష్ణా జిల్లా దివిసీమపై మొంథా తూఫాన్ ఎఫెక్ట్‌

    కృష్ణా జిల్లా దివిసీమపై మొంథ తూఫాన్ ప్రభావం పడింది. పలుచోట్ల అరటి తోటలు, కందపంటలు నేలకొరిగాయి. పంటనష్టంతో ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ- విజయవాడ కరకట్టపై భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. —

  • 29 Oct 2025 08:14 AM (IST)

    కాకినాడ జిల్లాలో తీవ్రంగానే తుఫాన్‌ ఎఫెక్ట్

    – కాకినాడ జిల్లాలో తీవ్రంగానే తుఫాన్‌ ఎఫెక్ట్

    – పిఠాపురం నియోజకవర్గంలో 25 పునరావాస శిబిరాలు

    – 12 వేల మందికి ఆహారం అందించేందుకు ఏర్పాట్లు

    – ఉప్పాడ, మూలపేట, కోనపాప పేట సహా.. తీరప్రాంత గ్రామాల్లో పరిస్థితులపై అధికారుల సమీక్ష

    – ఉప్పాడలో ఇంకా అల్లకల్లోలంగానే సముద్రం

    – ఉప్పాడలో మందు జాగ్రత్తగా రాత్రి 11 గంటలకు పవర్‌కట్‌

    – ఉదయానికి దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణ

    – బీచ్‌రోడ్డులో పలుచోట్ల ముందుకు చొచ్చుకువచ్చిన సముద్రం

  • 29 Oct 2025 08:04 AM (IST)

    విరిగిపడ్డ కొండ చరియలు

    నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. రాత్రి సమయంలో పడడంతో పెను ప్రమాదం తప్పింది. మూడు షాపులు దగ్ధం అయ్యాయి. రాత్రివేళ కావడంతో భక్తులు ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొండచరియలు పడకుండా పటిష్ట చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం అయినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

  • 29 Oct 2025 07:29 AM (IST)

    తుఫాను ఎఫెక్ట్‌

    — నంద్యాల జిల్లాపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్

    — నంద్యాల, మహానంది, బండి అత్మకూరులలో వర్షం

    — రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిస్తున్న వర్షం

    — పొంగిపొర్లుతున్న పాలేరు వాగు

    — ఉధృతం ప్రవహిస్తున్న కుందూ, చామకాల్వ నదులు

    — మహానంది బుక్కాపురం అలుగు పోస్తున్న చెరువు

    — నంద్యాల- మహానంది మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు

  • 29 Oct 2025 07:15 AM (IST)

    తుఫాను బీభత్సం

    తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఏపీలో భారీ నష్టం సంభవిస్తోంది. మొదట ఏపీలోని 9 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే 65 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియనున్నాయని, 83 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని వాతావవరణ శాఖ అధికారులు వెల్లడించారు.

  • 29 Oct 2025 07:10 AM (IST)

    ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

    కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

  • 29 Oct 2025 07:10 AM (IST)

    ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

    దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

  • 29 Oct 2025 06:55 AM (IST)

    ఈ జిల్లాల్లో మోస్తురు వర్షాలు

    కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

  • 29 Oct 2025 06:41 AM (IST)

    బలహీనపడనుందా?

    ఇది రానున్న 6 గంటల్లో తుపానుగా బలహీన పడనుందని వెల్లడించింది.తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

  • 29 Oct 2025 06:40 AM (IST)

    తీరం దాటింది

    మొంథా తీవ్రతుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

  • 29 Oct 2025 06:36 AM (IST)

    అప్రమత్తంగా ఉండాలి..

    మొంథా తీవ్రతుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

    ఇది రానున్న 6 గంటల్లో తుపానుగా బలహీన పడనుందని వెల్లడించింది.తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంది.

    దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

    కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

  • 29 Oct 2025 06:16 AM (IST)

    అల్లకల్లోలంగా సముద్రం

    తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్‌

    నరసాపూర్ సమీపంలో తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్‌

    అర్ధరాత్రి 11:30-12:30 మధ్య తీరందాటిన తీవ్ర తుఫాన్

    ఉదయం తుఫాన్‌గా బలహీనపడే అవకాశం

    అల్లకల్లోలంగా సముద్రం, తీరంలో ఎగసిపడుతున్న అలలు

    తుఫాన్‌ ప్రభావంతో భారీగా వీస్తున్న ఈదురుగాలులు

    తుఫాన్‌ ప్రభావంతో పెరిగిన గాలుల తీవ్రత

    ఈదురుగాలులకు విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు

    రాకపోకలకు అంతరాయం, ఇబ్బందులు పడుతున్న ప్రజలు

    అనేక గ్రామాలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

    మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

  • 29 Oct 2025 01:29 AM (IST)

    తీరం దాటిన మొంథా తుపాను

    మొంథా తీవ్ర తుపాను మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుపానుగా బలహీన పడనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • 29 Oct 2025 12:00 AM (IST)

    ప్రమాద హెచ్చరికలు జారీ

    ఇవి కేవలం జాగ్రత్త సూచనలు మాత్రమే. తుపాను ఒక పోర్టుకి 400 నుంచి 750 నాటికల్‌ మైళ్లు దూరంలో ఉన్నప్పుడు 1వ, 2వ నంబరు హెచ్చరికలు జారీ చేస్తారు. అంటే అల్పపీడనం ఏర్పడినప్పుడు తొలిగా పోర్టుకు హెచ్చరించే సూచనలు. తక్షణం జాగ్రత్తపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలన్నదానికి సంకేతాలు

  • 29 Oct 2025 12:00 AM (IST)

    పోర్టుల్లో ముందస్తు హెచ్చరికలు జారీ

    తుపానులు సముద్ర ప్రాంతాల్లో ఉద్ధృతంగా ఏర్పడినప్పుడు, మొదటగా ప్రభావితమయ్యే ప్రాంతాలు పోర్టులు. దీంతో మత్స్యకారులు, కార్గో కార్యకలాపాలు, సముద్ర రవాణా అన్నీ తుఫాను హెచ్చరిక వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. అందుకే భారత వాతావరణ విభాగం-IMD తుపాను తీవ్రత, దూరం, దిశ ఆధారంగా ప్రత్యేకంగా 1 నుంచి 11 వరకు నంబర్లలో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు దూసుకొస్తున్న “మొంథా” తుపాను కారణంగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

  • 28 Oct 2025 11:59 PM (IST)

    మొదలైన వర్ష బీభత్సం

    • మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఏపీలో వర్షబీభత్సం కొనసాగుతోంది. 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది.
    • కావలిలో అత్యధికంగా 22 సెం.మీ., సింగరాయకొండలో 18.7, దగదర్తిలో 18.2సెం.మీ. వర్షపాతం రికార్డయింది.
    • ఉలవపాడులో 17, కందుకూరులో 16.7 సెం.మీ.. కొడవలూరులో 15, కలిగిరిలో 14.2 సెం.మీ.సంతనూతలపాడు 14, లింగసముద్రంలో 13.7 సెం.మీ..ఒంగోలులో 12.7 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.
    • జోరువానలతో అనేక చోట్ల చెట్లు, కరెంట్‌ స్తంభాలు కూలిపోయాయి. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు కమ్ముకున్నాయి. విరిగిపడిన చెట్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాయి సహాయక బృందాలు.
  • 28 Oct 2025 11:36 PM (IST)

    రైల్వే శాఖ అప్రమత్తం

    తూర్పు తీరంపై మోంతా తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, రైల్వేలు డివిజనల్, జోనల్, బోర్డు స్థాయిలో వార్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. తూర్పు తీరం వెంబడి అవసరమైన వనరులను మోహరించారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులోని రైల్వే బృందాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. రైలు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.

  • 28 Oct 2025 11:34 PM (IST)

    రాబోయే 3-4 గంటలు చాలా కీలకం..!

    మొంత తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకడం ప్రారంభించింది. రాబోయే 3-4 గంటలు రాష్ట్రానికి చాలా కీలకం. దీని ప్రభావం 6-7 జిల్లాల్లో కనిపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మచిలీపట్నం నుండి విశాఖపట్నం వరకు బలమైన గాలులు వీస్తున్నాయి. ఏడు జిల్లాల్లో వాహనాల రాకపోకలను అధికారులు నిషేధించారు. ఈ జిల్లాల్లో రాత్రిపూట కర్ఫ్యూ కూడా ప్రకటించారు.

  • 28 Oct 2025 10:57 PM (IST)

    కరీబయిన్ దీవులు అల్లకల్లోలం!

    ప్రస్తుతం కరీబయిన్ దీవులు అల్లకల్లోలంగా మారాయి. మెలిస్సా హరికేన్ ఇప్పటికే జమైకా దక్షిణ తీరాన్ని బ్లాక్ రివర్ దగ్గర దాటేసింది. ఇక క్యూబా తూర్పు భాగంలోకి దూసుకెళ్తోంది. రేపు, మాపో బహామాస్ ద్వీపాలు, ఫ్లోరిడా దక్షిణ తీరం, హైటీ తూర్పు ప్రాంతాలు, డొమినికన్ రిపబ్లిక్ ఈశాన్య భాగాలను ముంచెత్తనుంది. గాలి వేగం గంటకు 280 కి.మీ. 24 గంటల్లో 75 నుంచి 100 సెం.మీ. వర్షపాతం నమోదవుతుంది అధికారులు హెచ్చరిస్తున్నారు. మామూలుగా 15సెంటిమీటర్ల వర్షానికే నగరాలు మునిగిపోయే పరిస్థితి. ఇక 75సెంటిమీటర్లంటే జమైకా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించుకోవచ్చు. ఇళ్లు, రోడ్లు, బ్రిడ్జ్‌లు ధ్వంసంకానున్నాయి. మిలియన్ల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

  • 28 Oct 2025 09:51 PM (IST)

    రాత్రంతా సచివాలయంలోనే జాగారం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

    ఇవాళ రాత్రికి ఏపీ సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు.

    • తుఫాన్‌ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న చంద్రబాబు
    • మొంథా తుఫాన్‌పై మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం సూచనలు
    • ప్రాణనష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
    • లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని ఆదేశం
    • కాల్వలు, చెరువులకు గండిపడకుండా పర్యవేక్షించాలన్న బాబు
    • ప్రతి గంటకు కలెక్టర్లు తుఫాన్ బులెటిన్లు ఇవ్వాలని ఆదేశం
    • వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచన
    • విజయవాడ, ఏలూరు, భీమవరంపై ఫోకస్ చేయాలన్న చంద్రబాబు
    • ప్రజలకు వాస్తవ సమాచారం అందించాలి-సీఎం చంద్రబాబు
    • తప్పుడు వార్తలు, భయాందోళనలకు అవకాశం ఇవ్వొద్దని సూచన
  • 28 Oct 2025 09:48 PM (IST)

    మరికాసేపట్లో తీరం దాటనున్న మొంథా

    తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుఫాను.. తీరాన్ని పూర్తిగా దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టనుంది. గడచిన 6 గంటల్లో 17 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మొంథా.. మంచికి పట్నం కు 110 కిలోమీటర్లు, కాకినాడ కు 90, విశాఖ కు 210 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమై ఉంది. ఈ క్రమంలో కాకినాడ పోర్ట్ కు పదో నెంబర్ ప్రమాదం హెచ్చరిక జారీ. తీవ్ర తుపానుగా కాకినాడ సమీపంలో కదులుతున్న మొంథా. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న తుఫాను.. మరికొంత సమయంలోనే పూర్తిగా తీరం దాటనున్న మొంథా.

  • 28 Oct 2025 09:22 PM (IST)

    ఈ రాత్రికి సచివాలయంలోనే సీఎం చంద్రబాబు

    రోజు రాత్రికి సచివాలయంలోనే సీఎం చంద్రబాబు ఉండనున్నారు. ఈ అర్ధరాత్రి తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం నిర్ణయం. తాను సచివాలయం నుంచి మానిటర్ చేయడం ద్వారా ప్రజల్లో ఆందోళన తగ్గించాలని ఆలోచన. RTGS నుంచి స్వయంగా సీఎం పర్యవేక్షించడం వల్ల వేగంగా సహాయ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నిర్ణయం.

  • 28 Oct 2025 09:19 PM (IST)

    కాకినాడ పరిసర జిల్లాలల్లో భారీ వర్షం

    మొంథా తీరందాటే సమయంలో కాకినాడ పరిసర జిల్లాలల్లో భారీ వర్షం, తీవ్రగాలులు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకినాడ పరిసరాల్లో గాలుల తీవ్రత ఎక్కువ ఉంటుందని, ముఖ్యంగా కాకినాడ, యానాం తీరప్రాంతాలకు ఉప్పెన ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు విశాఖలో కొన్నిచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

  • 28 Oct 2025 07:46 PM (IST)

    తీరం తాకిన మొంథా తుపాన్.. అర్ధరాత్రికి హై అలర్ట్

    కాకినాడ- మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకిన మొంథా తీవ్రతుపాన్. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదిలిన తుపాన్. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 20 కిమీ, కాకినాడకి 110 కిమీ, విశాఖపట్నంకి 220 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తిగా తీరం దాటడానికి 3-4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలో తీరం దాటునున్న తీవ్రతుపాన్. కోస్తా వెంబడి గంటకు 90-100 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయి. ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరికలు జారీ చేశారు.

  • 28 Oct 2025 07:42 PM (IST)

    మరో 3, 4 గంటల్లో తీరందాటనున్న మొంథా.. తీరంవెంట ఈదురు గాలుల బీభత్సం

    మొంథా తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. మరో 3, 4 గంటల్లో కాకినాడ సమీపంలో మచిలీపట్నం – కళింగపట్నం మధ్య పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.

  • 28 Oct 2025 07:21 PM (IST)

    అల్లూరి జిల్లాలో తుపాన్ ముందస్తు జాగ్రత్తలు.. ఆ 2 గ్రామాలకు ముప్పు

    అల్లూరి జిల్లాలో తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. జీకే వీధి మండలం తోకరాయి గ్రామానికి చెందిన 60 కుటుంబాలను దారకొండ తరలించిన పోలీసులు. గత ఏడాది భారీ వర్షాల ప్రభావానికి లోనుకావడంతో తోకరాయి, చట్రాపల్లి గ్రామాల్లో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. దీంతో మొంథా అలర్ట్స్ జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తమైన అధికారులు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పోలీస్ రెవెన్యూ యంత్రాంగం.

  • 28 Oct 2025 07:18 PM (IST)

    వచ్చే 2 గంటల్లో ఈ జిల్లాలకు వర్ష సూచన.. ఎల్లో అలెర్ట్ జారీ

    రాగల రెండు మూడు గంటలలో తెలంగాణలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, జోగులాంబ గద్వాల, జనగాం, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, నల్లగొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంబటంతో 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. తెలంగాణలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

  • 28 Oct 2025 06:55 PM (IST)

    రేపు ఉదయం 5:30 గంటల్లోగా ఈ జిల్లాలకు ఆకస్మిక వరదలు

    ఏపీ, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అధికారులు జారీచేశారు, రేపు ఉదయం 5:30 లోగా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశంఉన్నట్లు వెల్లడించారు.

    ఏపీ : గుంటూరు, కృష్ణ, వెస్ట్, ఈస్ట్ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలు

    తెలంగాణలో: భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం

    ఒడిసాలో: గజపతి , గంజాం జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక

  • 28 Oct 2025 06:39 PM (IST)

    ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

    మొంథా తుఫాను ప్రభావంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రాణనష్టం లేకుండా… ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలు, సహయక చర్యలు, పునరావాసం, నష్టం అంచనా అనే అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టాలని తెలిపారు.

  • 28 Oct 2025 06:35 PM (IST)

    అర్ధరాత్రికి తుపాన్ తీరం దాటే ఛాన్స్.. అప్రమత్తంగా ఉండండి: మంత్రి సత్య కుమార్

    ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి సత్య కుమార్ తుఫాన్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. సీఎం స్వయంగా మానిటర్ చేస్తున్నారు. ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. తుఫాన్ అర్ధరాత్రికి తీరం దాటుతుంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాము. బెడ్స్, ఫుడ్, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం సహాయ సహకారాలు ఉంటాయి. ప్రధాని పరిస్థితిపై ఆరా తీస్తున్నారని తెలిపారు.

  • 28 Oct 2025 06:34 PM (IST)

    కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చం నాయుడు పర్యటన.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

    అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఇంచార్జ్ మంత్రి అచ్చం నాయుడు, స్తానిక ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ సందర్శించారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వారందరినీ సురక్షిత పునరావస కేంద్రాలకు తరలించామని మంత్రి అచ్చం నాయుడు మీడియాకు తెలిపారు. గత రెండు రోజుల నుండి సీఎం చంద్రబాబు అధికారులతో తుఫాన్ పై అప్రమత్తంగా ఉన్నారు. తుఫాన్.. విపత్తు అనేది ఎవరు ఆపలేరు. కానీ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కేంద్రం నుండి వచ్చే సహకారంతో పాటు ప్రభుత్వం నుండి కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై ఆలోచిస్తున్నాం. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే హెచ్చరిక జారీ చేశాం. పునరావాస కేంద్రాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని ఆయన అన్నారు.

  • 28 Oct 2025 06:30 PM (IST)

    విజయవాడలో వెలవెల బోతున్న షాపింగ్ మాల్స్, స్టోర్స్..

    విజయవాడలో షాపింగ్ మాల్స్, స్టోర్స్ వెలవెల బోతున్నాయి. తుఫాన్ హెచ్చరికలతో బందర్, ఏలూరు రోడ్డు, బిసెంట్ రోడ్డు, 5 నంబర్ రోడ్డులో మూతపడ్డ వ్యాపార వాణిజ్య సముదాయాలు. తెరిచి ఉంచిన వాణిజ్య సముదాయాలను మూయిస్తున్న పోలీసులు. తక్షణమే ఇళ్లకు వెళ్ళిపోవాలన్న పోలీస్ పెట్రోలింగ్ టీమ్స్.

  • 28 Oct 2025 06:02 PM (IST)

    తీరానికి సమీపీస్తున్న మొంథా.. ఈ రాత్రికి తీరం దాటే ఛాన్స్!

    తీరానికి సమీపీస్తున్న మొంథా తీవ్ర తుఫాను. గడచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మొంథా. మంచిలి పట్నం కు 50 కిలోమీటర్లు, కాకినాడకు 130, విశాఖ కు 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమై ఉన్న మొంథా తుపాను. కాకినాడ పోర్ట్ కు పదో నెంబర్ ప్రమాదం హెచ్చరిక జారీ చేసిన అధికారులు. ఈ రాత్రికి తీవ్ర తుపాను గా కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంథా.

  • 28 Oct 2025 05:55 PM (IST)

    కృష్ణా జిల్లా సముద్రంలోకి కొట్టుకుపోయిన బోటు.. మత్స్యకారుల ఆందోళన

    కృష్ణా జిల్లాల్లోనూ మొంథా తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. సముద్రం అల్లకల్లలోలంగా మారింది. మంగినపూడి బీచ్ లో ఉవ్వెత్తున అలలు ఎగసిపడుతుండటంతో అధికారులు తొమ్మిదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో పోర్టు వద్ద పెట్టిన బోటు కొట్టుకుపోయింది. బోటులో వలతో పాటు ఇతర సామాగ్రి కొట్టుకుపోయాయి. మరొక బోటును అతికష్టం మీద ఒడ్డుకు తెచ్చిన మత్స్యకారులు. అధికారులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని చెప్పడంతో బోట్లను వదిలేసి వెళ్లిపోయామని చెబుతున్న మత్స్యకారులు. ప్రస్తుతం బోటు కొట్టుకుపోవడంతో మిగతా‌ మత్స్యకారుల్లో మొదలైన ఆందోళన. అధికారులు బోట్లు కొట్టుకుపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్న మత్స్యకారులు.

  • 28 Oct 2025 05:51 PM (IST)

    అనకాపల్లి బీచ్‌లో రాకాసి అలల బీభత్సం.. కోతకు గురైన తీర ప్రాంతం

    అనకాపల్లి జిల్లా రేవు పోలవరం బీచ్ లో కోతకు గురైన తీర ప్రాంతం. భారీ ఎత్తున ఎగసిపడుతున్న కెరటాలు. వెంటనే అప్రమత్తం చేసిన అధికారులు.

  • 28 Oct 2025 05:24 PM (IST)

    145 రేషన్ షాపుల ద్వారా 7 లక్షల‌మందికి రేషన్ సరుకుల పంపిణీ

    తుఫాన్ ప్రబావిత ప్రాంతాలలో పౌరసరఫరాలశాఖ అందించే సేవలకు సిద్దంగా ఉన్నామని మంత్రి నాదేండ్ల మనోహర్‌ అన్నారు. 12జిల్లాలలోని 145 రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయి. 7 లక్షల‌మంది లబ్ది దారులకు ఉపయోగ పడేలా నిత్యవసరాలు అందుబాటులో ఉంచాము. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలలో జనరేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. జనరేటర్స్ కు అవసరమైన డిజిల్, కిరోసిన్ కూడా అందుబాటులో ఉంచాం. 12 జిల్లాల్లో 626 పెట్రోల్, డీజిల్ ఆయిల్ కంపెనీ అవుట్లెట్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ఉండేందుకు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పెట్రోల్ డీజిల్ 3543 కిలో లీటర్ల అందుబాటులో ఉంచడం జరిగింది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 30,000 టార్పాలిన్ రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన అన్నారు.

  • 28 Oct 2025 05:22 PM (IST)

    ఆ 12 జిల్లాల్లో రేపు ఉదయం 9 గంటలకు రేషన్‌లో సరుకుల పంపిణీ.. మంత్రి నాదెండ్ల

    ఏలూరు జిల్లాలో తుఫాన్ ముందస్తు చర్యలను పరిశీలించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ , జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్. తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయి లో సేవలందించేందుకు పౌర సరఫరా శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలలో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లా, తిరుపతి… ఈ 12 జిల్లాల్లో రేపు ఉదయం 9 గంటల నుంచి రేషన్ షాప్ లో నిత్యవసర సరుకులు అందజేయనున్నట్లు తెలిపారు.

  • 28 Oct 2025 05:19 PM (IST)

    ఎన్టీఆర్ జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రి సత్య కుమార్

    ఎన్టీఆర్ జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి & జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తో కలసి తుపాను సంరక్షణ చర్యలపై సమీక్ష. జిల్లాలో చేపట్టిన చర్యలను మంత్రికి వివరించిన కలెక్టర్ లక్ష్మీశ.

  • 28 Oct 2025 05:17 PM (IST)

    పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..’అధైర్య పడొద్దు… ప్రభుత్వం అండగా ఉంది’

    పశ్చిమ గోదావరి జిల్లా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ , మంత్రి గొట్టిపాటి రవి కుమార్ , నర్సాపురం ఎమ్మెల్యే నాయకర్. నాగిడిపాలెం, పాతపాడు, కాళీపట్నం, మెట్రీవు పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రులు. తుఫాన్ సహాయక చర్యలను వివరించిన కలెక్టర్, ఎస్పీ. తుపాను ముప్పు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి. తుపానుతో అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    ప్రతీ పునరావాస కేంద్రంలో వైద్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలి. పునరావాస కేంద్రాల్లో ప్రజలకు మంచి తాగునీరు, భోజనం ఏర్పాటు చేయాలి. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దు. అధైర్య పడొద్దు. ప్రభుత్వం అండగా ఉంటుంది. తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. విపత్తు సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు.

  • 28 Oct 2025 05:13 PM (IST)

    బాపట్ల జిల్లాలో పెరిగిన గాలుల ఉధృతి.. వచ్చే 12 గంటలు మరింత కీలకం

    మొంథా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లాలోనూ గాలుల ఉధృతి పెరిగింది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. మోస్తరు వర్షం కురుస్తుంది. రానున్న పన్నెండు గంటలు కీలకమని, ఎప్పటికప్పుడు పరిస్థితిని కమాండ్ అండ్ కంట్రోల్ రూం నుండి పర్యవేక్షిస్తున్న అధికారులు కలెక్టర్ వినోద్ కుమార్‌కు తెలిపారు. క్షేత్ర స్థాయిలో పునరావాస కేంద్రాలను స్పెషల్ అధికారి వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు.

  • 28 Oct 2025 05:10 PM (IST)

    అవసరమైతేతప్ప బయటకు రావొద్దు.. కలెక్టర్‌ రాజాబాబు

    తుఫాన్‌ ప్రభావంతో సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో మత్స్యకారులు పడవలను, వలలను ఒడ్డుకు చేర్చుకున్నారు. అధికారుల హెచ్చరికలతో వేటకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. తుఫాన్‌ కారణంగా కురిసే భారీవర్షాలు, గాలులకు విద్యుత్‌ అంతరాయం, చెట్లు విరిగిపడటం, వాగులు, వంకల్లో నీటి ప్రవాహ ఉధృతితో రవాణాకు ఆటంకంతోపాటు ప్రమాదాలు జరిగే అవకాశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూంలో కలెక్టర్‌ రాజాబాబు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. తీర ప్రాంతంలో ఐదు మండలాల్లోని 18 గ్రామాలపై తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉండనున్న దృష్ట్యా ఆ గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు ప్రకాశంజిల్లా కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు.

  • 28 Oct 2025 05:08 PM (IST)

    ప్రకాశం జిల్లాలో దంచి కొడుతున్న వానలు.. అన్ని స్కూళ్లకు సెలవులు

    మొంథా తుఫాన్‌ ప్రభావంతో ప్రకాశంజిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురుస్తోంది. అక్కడక్కడ చిరుజల్లులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచి వర్షం ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం, రేపు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పాకల, కొత్తపట్నం, చీరాల బీచ్‌లలోకి పర్యాటకుల ప్రవేశాలను రద్దు చేశారు. నిన్న, నేడు, రేపు అన్ని రకాల విద్యాసంస్థలకు శెలవు ప్రకటించారు. ఒంగోలులోని కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేశారు. మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

  • 28 Oct 2025 05:04 PM (IST)

    మొంథా తీరందాటే సమయంలో మరింత జాగ్రత్తగా..

    పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్ర తుపాన్‌గా మారింది. గడిచిన 6 గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్.. ప్రస్తుతానికి మచిలీపట్నంకి 60 కిమీ, కాకినాడకి 140 కిమీ, విశాఖపట్నంకి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

  • 28 Oct 2025 05:02 PM (IST)

    శ్రీకాకుళంలో హై అలర్ట్.. 46మంది గర్భిణీలను హాస్పిటల్‌కు తరలింపు

    మొoథా సైక్లోన్ నేపద్యంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందన్నారు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి కలెక్టర్ అహ్మద్ ఖాన్. జిల్లాలో 36మందితో NDRF బృందం అందుబాటులో ఉందనీ చెప్పారు. నిన్న రాత్రి ఇచ్చాపురంలో ఒక కుటుంబాన్ని, సంతబొమ్మాళిలో ఒక కుటుంబాన్ని కచ్చ హౌస్ నుంచి పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేశామని ఆయన చెప్పారు.ఇప్పటి వరకు 46మంది గర్భిణీలను హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేయగా.. వారిలో 17 మందికి సురక్షితంగా ప్రసవాలు అయ్యాయనీ అంటున్నారు. తుఫాన్ ప్రభావం కారణంగా ఈరోజు నుoచి జిల్లాలో రేషన్ సరుకులను పంపిణీ చేస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ఇంచార్జి కలెక్టర్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

  • 28 Oct 2025 05:00 PM (IST)

    అలెర్ట్స్ ట్రాకింగ్ ద్వారా 2 గంటలకోసారి క్షేత్రస్థాయిలో సమీక్ష

    అలెర్ట్స్ ట్రాకింగ్ మెకానిజం ద్వారా ప్రతి రెండు గంటలకోసారి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. డ్రెయిన్లు పొంగి ప్రవహించకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.

  • 28 Oct 2025 04:58 PM (IST)

    మొంథా తుపాను.. కూటమి నేతలకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు

    రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొంథా తుఫాను తీవ్రతపై క్షేత్రస్థాయి పరిస్థితులను ఆరా తీసిన మంత్రి నారా లోకేష్. ఈ మేరకు ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో ఫోన్లో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వీరితోపాటు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణతో మంత్రి లోకేష్ ఫోన్లో మాట్లాడారు.

    మొంథా తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఈ రోజు చాలా ముఖ్యమని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి లోకేష్ సూచన. అన్నిరకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి సాయం కావాలన్నా తమను సంప్రదించాలని శాసనసభ్యులకు మంత్రి లోకేష్ సూచించారు. సంక్షోభ సమయంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని ఆదేశించిన మంత్రి నారా లోకేష్.

  • 28 Oct 2025 04:57 PM (IST)

    ఈ రాత్రి మరింత అప్రమత్తంగా ఉండాలి.. హోం మంత్రి అనిత

    ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి ప్రమాద తీవ్రత ఊహించలేమని మొంథా తుఫాన్ పై హోమ్ మంత్రి అనిత అన్నారు.  చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే విధంగా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఇప్పటినుంచి తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రాత్రి 11.30 సమయంలో కాకినాడ వద్దే తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాత్రి పూట కాబట్టి మరింత అప్రమత్తంగా ఉన్నాం.  శాటిలైట్ ఫోన్స్, జేసీబీ కానీ జేసీబీలు, NDRF, SDRF టీమ్స్ సిద్ధంగా ఉన్నాయ్. భవిష్యత్ లో వచ్చే తుఫాన్ లను ఎదుర్కునేందుకు ఒక SOP సిద్ధం చేసేలా చర్యలు తీసుకున్నామని హోమ్ మంత్రి అనిత తెలిపారు.

  • 28 Oct 2025 04:50 PM (IST)

    విశాఖలో కారుపై కూలిన భారీ వృక్షం

    విశాఖలో ఈదురు గాలలకు కూలుతున్న చెట్లు. లాసన్స్ బె కాలనీలో కూలిపోయిన భారీ వృక్షం. ఈదురు గాలులకు భారీ శబ్దంతో కారుపై పడిన చెట్టు. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది.

  • 28 Oct 2025 04:48 PM (IST)

    విజయనగరం జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ

    తుఫాన్ ప్రభావం నేపథ్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా తుఫాన్ ప్రభావం పై కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.

  • 28 Oct 2025 04:44 PM (IST)

    కాకినాడ పోర్టుకు గ్రేట్ డేంజర్ సిగ్నల్.. 10వ నంబర్‌ హెచ్చరిక జారీ

    కాకినాడ పోర్టుకు సమీపంగా లేదా పోర్టు మీద నుంచి బలమైన గాలులతో తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో పోర్టు యాక్టివిటీస్ మొత్తం నిలుపుదల చేయాలని ఇండికేషన్. షిప్ లు సముద్రానికి 150 నాటికల్ మైళ్ళ దూరం తీసుకుని వెళ్లిపోవడం, కార్గో ఆపరేషన్ మొత్తం క్లోజ్ చేసేయాలని అధికారులు తెలిపారు.

  • 28 Oct 2025 04:41 PM (IST)

    ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.. మంత్రి అనగాని

    మెంథా తుఫాన్ ఏర్పాట్లపై TV9 తో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. తుఫాన్ ప్రస్తుతం 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో కదులుతోందన్నారు. అది బలపడుతుందో, వీక్ అవుతుందో అనలైజ్ చేస్తున్నామన్నారు.

    ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. శాఖల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేటగిరైజ్ చేశాం. గర్భిణీ మహిళలు, సీనియర్ సిటిజన్ లను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని తెలిపారు. అవసరమైన నిధులు ఇచ్చి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. ప్రభుత్వానికి సహకరిస్తే చాలు. అన్ని జాగ్రత్తలు మేం తీసుకుంటామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

  • 28 Oct 2025 04:38 PM (IST)

    చెట్ల కింద, టవర్ల కింద ఉండొద్దు

    తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, టవర్ల కింద.. పురాతన పోరిల కింద ఉండకూడదంటూ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు హెచ్చరికలను గుర్తించాలని, అధికారులకు సహకరించాలని విజ్ఙప్తి.

  • 28 Oct 2025 04:36 PM (IST)

    కీలక ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు.. కోస్తాకు ఆకస్మిక వరదలు

    ఆంధ్రప్రదేశ్‌లో గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. 3 రోజులు వేటకు వెళ్లొద్దు. ఓడ రేవుల్లో కాకినాడ 10, విశాఖ, గంగవరం 9, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణ, వాడరేవు 8 నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. కొస్తాలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కూడా ఉంది.

  • 28 Oct 2025 04:34 PM (IST)

    మీటరు ఎత్తున ఎగసి పడుతున్న అలలు

    కాకినాడతోపాటు మిగతా ప్రాంతాల్లో కూడా తుపాను గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు, రేపు భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఇక కాకినాడ తీర ప్రాంతంలో ఒక మీటర్ ఎత్తు వరకు అలలు ఎగసి పడుతున్నాయి.

  • 28 Oct 2025 04:33 PM (IST)

    చెట్లు, ఇళ్లు, విద్యుత్‌ స్తంభాలు కూలుతాయ్.. జాగ్రత్త

    మొంథా తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గలలు విజయ అవకాశం ఉంది. కాకినాడకు 80-90 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రభావం ఉండనుంది. దీంతో ఈ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, టవర్స్ పడిపోయే అవకాశం ఉంది. చెట్లు నేలకొరుగుతాయి. పూరిళ్లు ధ్వంసం అవుతాయి.

  • 28 Oct 2025 04:32 PM (IST)

    తీరం వైపు క్రమంగా కదులుతున్న మొంథా..

    తీవ్ర తుపాను తీరం వైపు క్రమంగా కదులుతోందని, కాకినాడ సమీపంలోనే ఈ రాత్రికి తీరం దాటబోతోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాధకుమార్ టీవీ9కి తెలిపారు.

  • 28 Oct 2025 04:30 PM (IST)

    రేపు 12 జిల్లాల్లో అతి భారీ వర్షాలు

    రేపు తెలంగాణ లోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం మహబూబాబాద్, వరంగల్ జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో రేపు దాదాపు 12 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం.

  • 28 Oct 2025 04:28 PM (IST)

    ఆ 3 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

    మొంథా ప్రభావంతో తెలంగాణ లోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మూడు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ.

  • 28 Oct 2025 04:27 PM (IST)

    నేటి రాత్రికి తీరం దాటనున్న మొంథా.. ఈదురు గాలుల బీభత్సం

    రాగల 12 గంటలలో మోంధా తుఫాను ఉత్తర, వాయువ్యదిశలో కదులుతూ మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో ఇంచు మించు కాకినాడకు సమీపంలో ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

  • 28 Oct 2025 04:25 PM (IST)

    అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

    తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో రహదారులపై ఆంక్షలు. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల నుంచి నిలుపుదల. ముందే సురక్షిత లే భై లో నిలుపుకోవాలి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దంటూ ఏపి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

Published On - Oct 28,2025 4:23 PM

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..