ఓడలరేవు దగ్గర సముద్రం కల్లోలం.. ఎగసిపడుతున్న రాకాసి అలలు
ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాను మంజా. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలు, రాకాసి అలలతో సముద్రం కల్లోలంగా మారింది. ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రులు భరోసా ఇస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై తుఫాను మొంథా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటికే 230 కిలోమీటర్ల దూరం నుంచి 190 కిలోమీటర్లకు చేరుకున్న ఈ తుఫాను ఈరోజు రాత్రికి కాకినాడ-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ ప్రకటించింది. తీర ప్రాంతాలైన అల్లవరం, అంతర్వేది, కాకినాడలలో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మూడు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కాకినాడ ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, కోనసీమ ఇన్‌ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు, రైతులకు భరోసా కల్పిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొన్ని విమర్శలు.. కొన్ని పొగడ్తలు షాకింగ్ లుక్‌లో హీరో
కొడాలి నాని.. ఇలా అయిపోయారేంటి ??
మొంథా ఎఫెక్ట్.. ఈ రూట్‌లో నడిచే 97 రైళ్లు రద్దు
బస్సు ప్రమాదాలపై సెలబ్రిటీలు అవగాహన కల్పించాల్సిందే
Suman: నాపై ఆ స్టార్ చేతబడి చేశారు.. కేరళ వెళ్లి మరీ విరుగుడు చేయించుకున్నా
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

