Michaung Alert: ముంచుకొస్తున్న మిచాంగ్ తుపాను.. రేపు తీరం దాటే అవకాశం.. కోస్తాలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్
తుఫాన్ తీరం దాటే సమయంలో 80- 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయి. ప్రభావంతో కోస్తాలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ రోజు కోస్తాలో ఆరెంజ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి రెడ్ అలర్ట్స్ ఇచ్చారు. కోస్తా లోని అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ఆరో తేదీ వరకు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే రాయలసీమపై ప్రభావం చూపింది. శ్రీకాళహస్తి తిరుపతిలో గడచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కాస్త బలపడి తుఫాన్గా మారింది. తుఫాన్ కు మిచాంగ్ (michaung) గా నామకరణం చేశారు. తుపాను పేరును మిజాంగ్ ‘MIGJAUM’ గా ఉచ్చారిస్తున్నారు. తుపాను గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తాజా అంచనా ప్రకారం మిజాం తుపాను పాండిచ్చేరికి 290, చెన్నైకి 290, నెల్లూరుకు 420, బాపట్లకు 550, మచిలీపట్నానికి 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రికృతమై ఉంది. వాయువ్యంగా కదులుతూ తుపానుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం లో కి ప్రవేశించనుంది తుఫాను. రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడుకు ఆనుకొని దక్షిణ తమిళనాడు తీరం సమీపానికి తుఫాను చేరుకుంటుంది. ఆ తర్వాత ఉత్తర దిశగా ప్రయాణిస్తూ కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాను గమనం ఉంటుంది. సోమవారం రాత్రి – అయిదో తేదీ ఉదయం నాటికి నెల్లూరు – మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
భారీ ఈదురు గాలులు..రెడ్ అలర్ట్..
తుఫాన్ తీరం దాటే సమయంలో 80- 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విస్తాయి. ప్రభావంతో కోస్తాలో అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈ రోజు కోస్తాలో ఆరెంజ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి రెడ్ అలర్ట్స్ ఇచ్చారు. కోస్తా లోని అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. ఆరో తేదీ వరకు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఇప్పటికే రాయలసీమపై ప్రభావం చూపింది. శ్రీకాళహస్తి తిరుపతిలో గడచిన 24 గంటల్లో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. నెల్లూరులో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం సమీపానికి వచ్చే కొద్ది దాని ప్రభావం మిగతా జిల్లాల్లోనూ కనిపిస్తుందని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద. తుఫాను అల్లర్ట్స్ నేపథ్యంలో అంత అప్రమత్తం కావాలని సూచించారు. రైతుల తన పంటలను చక్క పెట్టుకోవాలని సూచించారు. ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాలో అధికార యంత్రం అప్రమత్తమైంది. కొన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
విశాఖ కలెక్టరేట్, జివిఎంసి ల లో తుఫాను కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
విశాఖ కలెక్టరేట్ తుపాన్ కంట్రోలు రూం నెంబర్లు: 0891-2590102, 0891-2590100.
జివిఎంసి తుపాన్ కంట్రోలు రూం నెంబర్లు: *టోల్ ఫ్రీ నెం. 180042500009 కంట్రోల్ రూమ్ నెం. 0891-2869106*
మిచాంగ్ తుఫాన్ కారణంగా జిల్లా కలెక్టరేట్, జివిఎంసి విభాగంలో తుఫాను కంట్రోల్ రూము లను ఏర్పాటు చేసినట్లు కలక్టర్ డా ఏ మల్లిఖార్జున తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం. 0891-2590102, 0891-2590100, జివిఎంసి విభాగంలో టోల్ ఫ్రీ నెం. 180042500009 కంట్రోల్ రూమ్ నెం. 0891-2869106 ఫోన్ నంబర్లతో పని చేస్తుందని కలెక్టర్ తెలిపారు. తుఫాను సమాచారాన్ని పట్టణ ప్రజలు పొందవచ్చని, గ్రామాల్లో పరిస్థితులను తెలియజేయవచ్చని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..