AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ భరోసా.. బురదలో కూరుకుపోయిన 180 బోట్లు వెలికితీత..

అర్నబ్ తుపాను తీరప్రాంత మత్స్యకారుల బతుకులను ఛిన్నాభిన్నం చేసింది. ఉపాధికి ఆధారమైన వేట పడవలు బురదలో కూరుకుపోయి, జీవనోపాధి ప్రశ్నార్థకమైన వేళ.. ఆ కుటుంబాలకు భరోసాగా నిలిచింది రిలయన్స్ ఫౌండేషన్. కోనసీమ జిల్లాలో భారీ క్రేన్లతో ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, 180కి పైగా బోట్లను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ భరోసా.. బురదలో కూరుకుపోయిన 180 బోట్లు వెలికితీత..
Reliance Foundation Cyclone Arnab Relief
Krishna S
|

Updated on: Nov 06, 2026 | 6:05 PM

Share

అర్నబ్ తుపాను సృష్టించిన విధ్వంసంతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ అండగా నిలిచింది. తుఫాన్ తీవ్రతకు కొట్టుకుపోయి, బురదలో కూరుకుపోయిన మత్స్యకారుల పడవలను తిరిగి వెలికితీసేందుకు ప్రత్యేక సహాయక చర్యలను చేపట్టింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 180కి పైగా దెబ్బతిన్న బోట్లను సురక్షితంగా బయటకు తీసి, మత్స్యకారుల జీవనోపాధిని పునరుద్ధరించేందుకు రంగంలోకి దిగింది. నిపుణుల పర్యవేక్షణలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా తీర ప్రాంతంలోని సుమారు 10,000 మందికి పైగా లబ్ధి చేకూరనుంది. కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిధిలోని ఓడలరేవు, సఖినేటిపల్లి ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాల్లో మత్స్యకారుల జీవనోపాధి పూర్తిగా స్తంభించిపోయింది. తుఫాన్ దాటికి బోట్లు లంగర్ల నుంచి కొట్టుకుపోయి కాలువలు, బురద గుంటలు, తీర ప్రాంతాల్లో ఇరుక్కుపోయాయి. దాదాపు 186 బోట్లు బురదలో కూరుకుపోవడమే కాకుండా, కొన్ని ఒకదానిపై ఒకటి పడి, మరికొన్ని పూర్తిగా లేదా పాక్షికంగా నీటమునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సాధారణంగా ఒక్కో బోటు 5 నుంచి 10 టన్నుల బరువు ఉంటుంది. బురద పేరుకుపోయి, నేల పటుత్వం కోల్పోవడం, రవాణా సౌకర్యం లేకపోవడంతో మానవ ప్రయత్నాలతో వాటిని వెలికితీయడం అసాధ్యంగా మారింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించిన రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు.. తమ వి కేర్ నిబద్ధతతో తక్షణమే స్పందించి ప్రత్యేక యంత్రాల ద్వారా బోట్లను సురక్షితంగా వెలికితీయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ స్థానిక మత్స్యశాఖ, అల్లవరం మండల ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రంగంలోకి దిగింది. భారీ క్రేన్లు, అధునాతన లిఫ్టింగ్ పరికరాలతో పకడ్బందీ భద్రతా ప్రమాణాల నడుమ వెలికితీత పనులను ప్రారంభించింది. స్థానిక మత్స్యకారుల సహాయంతో బోట్లను గుర్తించి, వాటి లొకేషన్లను నిర్ధారించిన తర్వాత క్రమపద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటిగా పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఈ సహాయక చర్యల ద్వారా బోట్లు మరింత దెబ్బతినకుండా కాపాడటంతో పాటు వాటికి అవసరమైన మరమ్మతులను త్వరగా పూర్తి చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. తద్వారా తుఫానుతో ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు సాధ్యమైనంత త్వరగా తిరిగి సముద్ర వేటకు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. దేశవ్యాప్తంగా విపత్తుల సమయంలో బాధితులను ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుండే రిలయన్స్ ఫౌండేషన్.. తాజా చర్యతో కోనసీమ మత్స్యకారుల జీవితాల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురింపజేస్తుంది.

Follow Us